సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు

అక్షర ఆయుధం; తెలంగాణ మావోయిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బ తగిలింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన అనుచరులు సైతం లొంగిపోయారు. మెుత్తం 31 ఏకే-47లతో పాటు 134 ఆయుధాలను మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు.తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఎదుట 124 మంది మావోయిస్టులు లొంగిపోయారు. హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో మావోయిస్టులు లొంగిపోయారు. ఏవోబీ కీలక నేత చలసాని నవత లొంగిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలను సరెండర్ చేశారు. 31 ఏకే 47లతోపాటు 134 ఆయుధాలను అప్పగించారు. దేవ్‌జీకి చెందిన PLGAదళం మెుత్తం సరెండర్ అయ్యింది. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్హణరావు అలియాస్ గణపతి లొంగిపోతారని అంతా ప్రచారం జరిగింది. కానీ గణపతి లొంగిపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *