జనం న్యూస్ : కవిత కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్గ్ర సేన పార్టీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్‌గా స్పందించారు. చాలా పార్టీలు వస్తుంటాయి… పోతుంటాయని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీపై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయి… పోతుంటాయి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చారు.25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ అని అన్నారు. కొత్త పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పేశారు. రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీఆర్ఎస్ అధినేత కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ గురించి చాలామంది మాట్లాడుతారని అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అని…భవిష్యత్ కార్యాచరణపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుంటామని కేటీఆర్ అన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడతాం. ప్రజాసమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిని అవుతానని కవిత ధీమా తెలంగాణకు ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రిని అవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త విప్లవం మెుదలైంది అని …తమను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇంటి నుంచి మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బయలుదేరారు. ఆవిర్భావ సభకు ర్యాలీగా వెళ్తున్న కవితను మీడియా ప్రశ్నించింది. తెలంగాణ ప్రజలు తనను, తన పార్టీని ఆదరిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఈ తెలంగాణలో ప్రతి వర్గానికి సమాన న్యాయం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) మాజీసీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కవిత తాజాగా కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై కొత్త పార్టీని ప్రకటించారు.తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్)గా ప్రకటించారు. తమ పార్టీని ఆదరించాలని తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు ముందు బంజారాహిల్స్‌లోని నివాసంలో భర్త అనిల్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న ఆమె, పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, దైవ దర్శనం, శాస్త్రోక్త పూజలతో ఆమె నూతన ప్రస్థానాన్ని ప్రారంభించారు.మరోవైపు క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నిరుపేద, బడుగు, బలహీనవర్గాల గొంతుకలమై నినదిస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.