సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లెజిస్టేటర్ స్పోర్ట్స్ మీట్-2026ను తాము బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కనబెట్టి, అర్థాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం ప్రజలు సమర్థించరని, ఇది మంచి పరిణామం కాదని కేటీఆర్ అన్నారు. నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే తెలంగాణ ప్రజాప్రతినిధులకు బిగ్ రిలీఫ్ ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రజాప్రతినిధులకు ఆటలపోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లెజిస్టేటర్ స్పోర్ట్స్ మీట్-2026కు బీఆర్ఎస్ సభ్యులు హాజరుకావడం లేదు అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొనం తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు అనేక సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలలో పాల్గొని సమయం వృథా చేయడం తగదని స్పష్టం చేశారు. ‘మేము ఎమ్మెల్యేలుగా ఈ క్రీడా పోటీలలో పాల్గొనబోమని కేటీఆర్ వెల్లడించారు. సభను కనీసం ఇంకో 10 రోజులు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అనేక కీలక అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను పక్కనబెట్టి, అర్థాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసి క్రీడలు నిర్వహించడం ప్రజలు సమర్థించరని, ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా ఈ క్రీడా పోటీలపై పునరాలోచన చేయాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. స్పోర్ట్స్ మీట్ చైర్మన్‌గా మంత్రి జూపల్లి లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహణ కోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చైర్మన్‌గా, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కో-ఛైర్మన్‌గా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.