అక్షర ఆయుధం : ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం ప్రభావం భారత్‌పై చూపిస్తోంది అని లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో భారత్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటుంది అని తెలిపారు. ఈ యుద్ధం పలు దేశాలల్లోని వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై చూపుతోంది అని అన్నారు. యుద్ధం ఆపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు.పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ మేరకు పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్‌లో ప్రధాని స్టేట్‌మెంట్ ఇచ్చారు.‘ఈ యుద్ధంతో ప్రపంచంపై తీవ్ర ప్రభావం ఉంది.భారత్‌కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చింది. గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు ఉన్నారు. భారతీయులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు.‘భారతీయుల కోసం హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. 3 లక్షల 75 వేలమందిని సురక్షితంగా భారత్‌కు తరలించాం. ఇరాన్ నుంచి 1000 మందిని తరలించాం’అని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.పెట్రోల్ గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నాంప్రజలకు పెట్రోల్, గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నాం అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. 60 శాతం LPGని భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నాం అని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ‘53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల డీజిల్ ఆదా అవుతుంది. ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉంది. భారత్‌పై మాంద్యం ప్రభావం లేకుండా చూస్తున్నాం’అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు.యుద్ధాన్ని ఆపడానికి నా వంతు కృషి చేస్తున్నా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. కరోనా సమయంలోనూ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం అని చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు డీజిల్ కొరత లేకుండా చూస్తాం అని హామీ ఇచ్చారు.పవర్‌ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి అని చెప్పుకొచ్చారు. ప్రతిరోజు పశ్చిమాసియాదేశాధ్యక్షులతో మాట్లాడుతున్నా… యుద్ధాన్ని ఆపడానికి తన వంతు కృషి చేస్తున్నాను అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు.