సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పంపిణీపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పంపిణీపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో పలువురు లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించిన చంద్రబాబు నాయుడు… వారితో ముచ్చటించారు. లబ్దిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఒకేసారి 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయంటే ఓ చరిత్ర అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు మరో 4.50 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు ఇవ్వాలనేది తమ సంకల్పమని చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలని అస్తవ్యస్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నింటినీ సరిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని దారి మళ్లించారని విమర్శించారు. నివాస యోగ్యంకాని స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో పోలవరాన్ని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిని హైదరాబాద్, చెన్నై కంటే గొప్పగా తయారు చేసే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపారు. నాయకులు, అధికారులు ప్రజలు మెచ్చేలా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తామని చెప్పారు. బాగా పనిచేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పారు. స్త్రీశక్తి కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు.పెన్షన్ల పంపిణీని రియల్‌టైమ్ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం… రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలలో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేసింది. గతేడాది నవంబర్‌లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడపేట మండలం పుదూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందించారు