విశాఖ-ఢిల్లీ విమానానికి షాక్

ఇంజిన్ ఫెయిల్యూర్‌తో డిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ

అక్షర ఆయుధం : విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం ఇంజిన్ వైఫల్యం చెందినట్టుగా తెలుస్తోంది.విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం ఇంజిన్ వైఫల్యం చెందినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ విమానం వెంటనే ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు… ఢిల్లీలోని ఇందిరా గాంధఅంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వివరాలు… ఇండిగో నిర్వహిస్తున్న బోయింగ్ 737-800 విమానం (6E 579) ఈరోజు ఉదయం విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరింది. ఈ విమానంలో 161 మంది ఉన్నారు. అయితే మరికాసేపట్లోflighఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉందనగా… ఈ విమానంలో ఒక ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. ఈ క్రమంలోనే పైలట్‌ సమాచారంతో వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం-ఢిల్లీ ఇండిగో విమానం కోసం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 10.39 గంటలకు పూర్తిస్థాయి ఎమర్జెన్సీని ప్రకటించారు. పూర్తి అత్యవసర నిబంధనల ప్రకారం వెంటనే ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ విమానం ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ విమానం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో ఎయిర్‌పోర్టులోని రన్‌వే 28పై ఉదయం 10:54 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో ఇండిగో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక, విమానం ల్యాండ్ అయిన తర్వాత అందులోని ప్రయాణికులకు ఇండిగో సిబ్బంది, ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ బృందం సహాయం అందించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో సాధారణ పరిస్థితి నెలకొంది.ఇంజిన్‌లో అధిక ప్రకంపనలు గుర్తించిన తర్వాత విమానంలోని ఒక ఇంజిన్‌లో ఆకాశంలోనే పనిచేయడం ఆగిపోయింది. ల్యాండింగ్ తర్వాత ఆ విమానాన్ని తనిఖీ, మరమ్మతుల కోసం నిలిపివేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించాం. ప్రాంతీయ విభాగం డీఏఎస్ (ఎన్ఆర్) తదుపరి విచారణ జరుపుతోంది’’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది.‘‘విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం లాంటి పరిస్థితి ఎదురైంది. విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది’’ అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.ఇండిగో ఏం చెప్పిందంటే.ఈ ఘటనకు సంబంధించి ఇండిగో ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం విమానానికి అవసరమైన తనిఖీలు, నిర్వహణ చేపట్టినట్టుగా పేర్కొంది. ‘‘2026 మార్చి 28న విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానం 6E 579లో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు ఒక సాంకేతిక లోపం గుర్తించబడింది. ముందుజాగ్రత్త చర్యగా స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానానికి అనుగుణంగా… పైలట్లు ప్రాధాన్యత క్రమంలో వెంటనే ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. ఈ విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. సంబంధిత అధికారులందరికీ వెంటనే సమాచారం అందించబడింది. ఆ విమానానికి అవసరమైన తనిఖీలు, నిర్వహణ జరుగుతున్నాయి’’ అని ఇండిగో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *