కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా

40 ఏళ్ల రాజకీయ ప్రయాణానికి ముగింపు

జనం న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి ముగింపు పలికారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. గత 20 మాసాల నుండి అనుభవిస్తున్న మానసిక క్షోభను అధిగమించలేక చివరికి రాజీనామా చేస్తున్నానని. ఏఐసీసీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి నాలుగు దశాబ్ధాల కాంగ్రెస్ పార్టీతో ప్రయాణానికి ముగింపు పలికారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను విడుదల చేశారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజీనామా ప్రకటన వెలువడగానే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి ఏఐసీసీ దూతల వరకు వెళ్లి బుజ్జగించినప్పటికీ ఫలించలేదు. చివరకు మార్చి 25న మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటటించారు. ఈ సందర్భగా రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. నాలుగు దశాబ్ధాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తనకు పలు అవకాశాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏడాది క్రితం ఫిర్యాదు చేసిన నో రెస్పాండ్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను లేఖలో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను 2024 అక్టోబర్ 24 కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నాడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ, భవిష్యత్ కార్యాచరణ గురించి, మార్గదర్శకం చేసేవిధంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరం అని లేఖలో జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యే సూచనలతో నామినేటెడ్ పోస్టులు దశాబ్ద కాలం వివిధ హెూదాలతో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శాసన సభలో, శాసన మండలిలో ఏకపక్షంగా పోరాటం చేసినట్లు జీవన్ రెడ్డి లేఖలో చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించకపోవడం దానికితోడు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వపరంగా నామినేటెడ్ పోటులన్నింటిలో కూడా ఫిరాయింపు M.L.A. సలహా, సూచనల మేరకే నియామకాలు చేయడం బాధించింది అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *