రాష్ట్ర పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు పాత్ర ఉందని పవన్ వ్యాఖ్య

పయనించే సూర్యుడు న్యూస్ : ‘స్టీల్‌ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు. స్టీల్‌ప్లాంట్ ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ పెట్టుబడులు మాలో విశ్వాసాన్ని పెంచింది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘రాష్ట్రం బ‌లంగా ఉండాలి…పెట్టుబ‌డులు రావాలి అని. అలా ఉండాలంటే దార్శ‌నిక‌త ఉన్న వ్య‌క్తి రావాలి. నాపై అభిమానం ఉన్నా, నాకు అనుభ‌వం లేదు. అన‌కాప‌ల్లికి మిట్ట‌ల్ వంటి వారిని తీసుక‌రావాలంటే దార్శ‌నిక‌త ఉన్న చంద్ర‌బాబుతోనే సాధ్యం’ అని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అన్నారు.అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రాజయ్యపేటలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో, లక్ష మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభించడం అనేది ఈ ప్రాంత యువతకు గొప్ప వరం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ పెట్టుబడులు మాలో విశ్వాసాన్ని పెంచింది ‘స్టీల్‌ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న స్టీల్ ప్లాంట్ ప్రతినిధులకు ధన్యవాదాలు. స్టీల్‌ప్లాంట్ ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ పెట్టుబడులు మాలో విశ్వాసాన్ని పెంచింది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు ‘పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నేత కావాలని ఎన్నికల్లో చెప్పాను. లక్ష్మీమిట్టల్‌ను ఒప్పించి పెట్టుబడులు తీసుకురావాలంటే చంద్రబాబు వల్లే సాధ్యం. రాజకీయ ధురంధరుడు చంద్రబాబు వల్లే పెట్టుబడులు వస్తున్నాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబే కారణమని అమిత్‌షా చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్ట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. అత్యాధునిక సాంకేతికతతో గ్రీన్‌ఫీల్ట్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది. అనంతపురంలో కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత దిశాదశ మారుతుంది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యం ‘ఆంధ్రప్రదేశ్‌పై, మా ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఇంత భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినందుకు ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్, సీఈఓ దిలీప్ ఉమెన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కర్బన ఉద్గారాలను (కార్బన్ ఫుట్‌ప్రింట్) పరిమితం చేసేలా ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న సంస్థలను మేం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *