దేశభక్తి గీతం వందేమాతరంపై మజ్లిస్ సభ్యులపై చర్యలేదా?

* స్పీకర్‌ను ప్రశ్నించిన బండి సంజయ్

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ అసెంబ్లీలో వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో మజ్లిస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మజ్లిస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్‌ల సమక్షంలోనే మజ్లిస్ సభ్యులు సభను వాకౌట్ చేసినా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీలో ‘వందేమాతరం’ గేయాలాపన జరుగుతున్న సమయంలో ఎంఐఎం (MIM) సభ్యులు సభను బహిష్కరించడంపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భరతమాత ఆత్మకు, జాతీయ గేయానికి జరిగిన అవమానం అని మండిపడ్డారు. ఎంఐఎం సభ్యులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ చర్యలు తీసుకోకపోవడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. మజ్లిస్ నేతల ‘‘వందేమాతరం’’ ఉల్లంఘనపై చర్యలేవి? అని ప్రశ్నించారు. మీరు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నారనే విషయం మర్చిపోయారా? అని మండిపడ్డారు. వందేమాతరం గేయం ఆలపించేటప్పుడు తప్పనిసరిగా సభ్యులంతా లేచి నిలబడి గౌరవించాలనే సంగతి తెలియదా? అని నిలదీశారు. పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే ప్రేక్షక పాత్ర వహించడమేంటి? అంటూ తీవ్రస్థాయిలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్, స్పీకర్, మండలి ఛైర్మన్ సాక్షిగా మజ్లిస్ నేతలు ‘‘వందేమాతరం’’ గేయాన్ని అవమానించినా మీకు పట్టదా? అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తప్పనిసరి చేస్తూ 2026లోనే కేంద్రం ఉత్తర్వులిచ్చిన విషయం మర్చిపోయారా? అని గుర్తు చేశారు. వందేమాతరం గేయ ఆలాపాన సమయంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ కాబట్టి నోటీసులివ్వడానికి భయపడుతున్నారా?అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సజయ్ కుమార్ అన్నారు. శాసన వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలింది మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుతో శాసన వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలింది.తాజాగా స్పీకర్ సాక్షిగా నిండు సభలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు వందేమాతరం అవమానించినా చర్యలు తీసుకోవడం లేదంటే ఏమనుకోవాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి …మజ్లిస్ నేతలు ‘‘వందేమాతరం’’ను అవమానిస్తున్నప్పుడు మీతోసహా మంత్రులంతా సభలోనే ఉన్నారు కదా? అని బండి సంజయ్ కుమార్ నిలదీశారు. సభ నియమ నిబంధనలను, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అని మండిపడ్డారు మజ్లిస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలకు ఆదేశించండి ‘ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాజ్యాంగ పుస్తకాన్ని రోజు చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు కదా? ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలనే సోయి మీ ప్రభుత్వానికి లేదా?’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ నిలదీశారు. ‘రాష్ట్రంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిరక్షుడైన గవర్నర్ సమక్షంలోనే ఉల్లంఘన జరిగినా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి ఏ సందేశాలు పంపుతున్నారు?. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన మజ్లిస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలకు ఆదేశించండి’అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అని డిమాండ్ చేశారు. భరతమాత ఆత్మకు అవమానం మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా సభలో మజ్లిస్ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. ఇది భరతమాత ఆత్మకు, జాతీయ గేయానికి జరిగిన అవమానంగా అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు సిగ్గుచేటని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. వందేమాతరం ఆలాపనను బహిష్కరించడం హేయమైన చర్య:ఎన్ రాంచందర్ రావు మజ్లిస్ సభ్యులు సభలో వ్యవహరించిన తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తీవ్రంగా స్పందించారు. వందేమాతరం ఆలాపనను బహిష్కరించడం హేయమైన చర్యగా అభిప్రాయపడ్డారు. మజ్లిస్ సభ్యుల విధేయత ఎవరి పట్ల ఉందో దేశ ప్రజలు గమనిస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. పార్లమెంటులో ‘జై పాలస్తీనా’ అని నినాదాలు చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు గుర్తు చేశారు. అసలేం జరిగింది? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే.అయితే సభలో’వందేమాతరం’ గేయాలాపన జరుగుతున్న సమయంలో ఎంఐఎం (MIM) సభ్యులు సభను బహిష్కరించడం రాజకీయ దుమారానికి దారితీసింది. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం విధిగా ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సోమవారం ఉభయ సభల ప్రారంభంలో ‘జయ జయహే తెలంగాణ’ గీతం తర్వాత వందేమాతరం ఆలపించారు. ఆ గేయాలాపన సమయంలో సభలోనే ఉన్నారు ఎంఐఎం సభ్యులు. అయితే వందేమాతరం ఆలాపన మొదలు కాగానే ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మౌనంగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫెందీ మాత్రం సభలోనే ఉన్నారు. మరో ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ గేయం పాడుతున్నప్పుడు తన కుర్చీలోనే కూర్చుండిపోయారు. పక్కనే ఉన్న బీజేపీ సభ్యుడు లేచి నిలబడాలని సూచించగా…ఆయన కూడా సభ నుంచి బయటకు వెళ్లడం గమనార్హం. అయితే జాతీయ గీతం‘జనగణమన’ఆలాపన సమయంలో మజ్లిస్ సభ్యులంతా లోపలికి రావడం గమనార్హం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *