మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై కేసీఆర్ ఆగ్రహం

షోకాజ్ నోటీసులు జారీ

అక్షర ఆయుధం : మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 17న పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.మెయినాబాద్ వ్యవహారం పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి పార్టీ ప్రధాని కార్యదర్శి పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఆదేశించింది.మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. మెయినాబాద్ ఫాం హౌస్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో రోహిత్ రెడ్డిక షోకాజ్ నోటీసులు జారీ చేసిందిజ రోహిత్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసుల్లో బీఆర్ఎస్ హెచ్చరించింది. డ్రగ్స్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్ కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు బీఆర్ఎస్ నోటీసుల్లో పేర్కొంది. నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం ‘మెయినాబాద్ ఫాం హౌస్‌లో జరిగిన ఘటనపై పలు మీడియా నివేదికలు మరియు ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో మీరు హాజరై ఉండగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగించబడ్డాయని ఆరోపణలు వెలువడిన విషయం పార్టీ ఉన్నత న్యాయకత్వం దృష్టికి వచ్చింది. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు పార్టీకి మరియు ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించాయి’అని బీఆర్ఎస్ నోటీసుల్లో పేర్కొంది.‘బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగి ఉంది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల లేదా మత్తు పదార్తాల వినియోగం లేదా వాటిత ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది’ అని బీఆర్ఎస్ నోటీసుల్లో తెలిపింది.వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలి.‘పై సంఘటనలో మీ హాజరు మరియు ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట మరియు విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం కలిగించాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు, ఈ నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజులలోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై మీ జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వక వివరణ సమర్పించవలసిందిగా మిమ్మల్ని ఈ నోటీసు ద్వారా ఆదేశిస్తన్నాం’అని బీఆర్ఎస్ వెల్లడించింది.‘ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలు మరియు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండవలసిందిగా ఆదేశిస్తున్నాం అని లేఖలో పేర్కొంది.ఈ నోటీస్ గడువులోపు సంతృప్తికరమైన వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ రాజ్యాంగం మరియు నియమావళి ప్రకారం మీపై తగిన క్రమశిక్షణాత్మక చర్యలు ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తీసుకోబడతాయని గమనించగలరు’అని బీఆర్ఎస్ నోటీసుల్లో పేర్కొంది. మార్చి 14న పార్టీ కలకలం ఇకపోతే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో మార్చి 14న జరిగిన డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్‌హౌస్‌లో కొకైన్‌తో సహా డ్రగ్స్ సీజ్ చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వారు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కి యూరిన్ టెస్ట్ నెగెటివ్ వచ్చినా, బ్లడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *