దేశంలో టాప్ రిచ్చెస్ట్ మహిళా ఎమ్మెల్యేలు

*టాప్ 3లో ఏపీ నేతలే

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్లో (ఎంపీలు, ఎమ్మెల్యేలు) 14 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో అత్యంత సంపన్నుల జాబితాలో తొలి మూడు స్థానాలనూ ఏపీకి చెందిన ఎమ్మెల్యేలే కైవసం చేసుకున్నారు. వీరిలో టీడీపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ.716 కోట్ల ఆస్తితో దేశంలోనే అత్యంత సంపన్న మహిళా ప్రజాప్రతినిధిగా మొదటి స్థానంలో నిలిచారు. కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి రూ.388 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో…నెల్లిమర్ల నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి రూ.291 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంచలన నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధులలో 14 మంది బిలీనియర్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. ఈ 14 మంది మహిళా బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. అయితే వీరిలో అత్యంత సంపన్న మహిళా ప్రజాప్రతినిధుల టాప్ 3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎమ్మెల్యేలు ఉండటం విశేషం.నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి(టీడీపీ) రూ.716.33 కోట్లతో దేశంలోనే అత్యంత సంపన్నమైన మహిళా ప్రజాప్రతినిధిగా టాప్ స్థానంలో నిలిచారు. కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి(టీడీపీ) రూ.388.10 కోట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఇకపోతే విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి(జనసేన పార్టీ)రూ.291.17 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో జత చేసిన అఫిడవిట్ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు అసోసియేషన్ ఫర్ డెమెుక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ప్రకటించింది. 68 మహిళా ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఇకపోతే క్రిమినల్ కేసుల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 476 మంది మహిళా సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలలో 127(27శాతం) మహిళలపై క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 68(14శాతం) మంది మహిళా ఎమ్మెల్యేలు తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఇకపోతే విద్యాభ్యాసం విషయానికి వస్తే 70శాతం మంది మహిళా ప్రజాప్రతినిధులు డిగ్రీ అంతకంటే ఎక్కువ చదివారు. మిగిలిన 25శాతం మంది 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్నారు. కొద్ది మంది డిప్లొమా, కొద్దిగా అర్హతలు కలిగిన వారు ఉన్నారు. ఇకపోతే ఏజ్ విషయానికి వస్తే 63 శాతం మంది 41 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండగా…24 శాతం మంది మహిళా ప్రజాప్రతినిధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్నారు. ఇక మిగిలిన 12 శాతం మంది మహిళా ప్రజాప్రతినిధులు 61 నుంచి 80 ఏళ్ల మధ్యలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *