అక్షర ఆయుధం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా అభివృద్ది చెందుతున్నాయని తెలిపారు. అయితే కొందరు నాయకులు ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇటీవల రాష్ట్ర విభజనపై మాట్లాడిన మాటలు లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా లోక్‌సభ స్పీకర్‌కు మీరు లేఖ రాయాలని కోరారు. ఇది తాను చేస్తున్న విజ్ఞప్తి అని పేర్కొన్నారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియనది కాదు. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ (నాటి హైదరాబాద్ రాష్ట్రం)ను 1948లో బలవంతంగా విశాలాంధ్రలో విలీనం చేసిన నుంచి… అంటే 1956 నుంచి జరుగుతున్న పరిణామాలు, అభివృద్దిలో వివక్ష, ఇక్కడి ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలు, ముల్కీ-నాన్ ముల్కీ ఆందోళనలు, తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమే!’’ అని పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ గురించి ప్రస్తావించారు. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నామని చెప్పారు. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారని… ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతుంటాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇదే మనందరికీ కావాల్సిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదని అన్నారు. టీడీపీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు… కొన్ని సార్లు టీడీపీ నాయకులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సుమచితంగా లేవని ఆరోపించారు. రాష్ట్ర విభజన ఏదో అనుచితంగా జరిగినట్టు, అసమంజసంగా తెలంగాణ ఏర్పడ్డట్టు చేస్తున్న అసందర్భపు వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన స్పర్థలు, వైషమ్యాలు, ద్వేషాలు రగిలించేవిగా ఉంటున్నాయని అన్నారు.‘‘ఏపీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పెద్దగా మీరు చొరవ తీసుకొని మీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన నాయకులకు చెప్పండి. భారత్ – పాకిస్తాన్ విభజనలా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ ప్రత్యేక భేటీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్మే విధంగా ఉన్నాయి..