జనం న్యూస్ : డీలిమిటేషన్ బిల్లుతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రసక్తేలేదు అని వివరణ ఇచ్చారు. మీకు గ్యారెంటీ కావాలంటే నా మాటే గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంపైనా తమకు వివక్ష లేదు అని ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాలతోపాటు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లు లింక్ పెట్టి ఎన్డీఏ లబ్ధిపొందాలని చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు జనాభా ప్రాతిపదికన సీట్లు పెరిగితే తెలుగు రాష్ట్రాల్లో అంతగా సీట్లు పెరిగే అవకాశం ఉండకపోవడం వల్ల లోక్సభలో ప్రాతినిథ్యం మరింత తగ్గిపోతుందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత మరింత తగ్గుతుందని రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వాదనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవు అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంపైనా మాకు వివక్ష లేదు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇలా అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని ప్రధాని తెలిపారు. డీలిమిటేషన్ బిల్లుతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రసక్తేలేదు అని వివరణ ఇచ్చారు. మీకు గ్యారెంటీ కావాలంటే నా మాటే గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంపైనా తమకు వివక్ష లేదు అని ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లు దేశానికి సరికొత్త దశను, దిశను నిర్దేశిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం అని….వారికి తగిన అవకాశం కల్పిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. వికసిత్ భారత్ అంటే కేవలం రోడ్లు, రైళ్లు, భవనాలు వంటి మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని.. అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన వికసిత్ భారత్ అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. బిల్లు వెనుక రాజకీయ దురుద్దేశాలు లేవు మరోవైపు మహిళా బిల్లు రిజర్వేషన్ల బిల్లు వెనుక ప్రధాని నరేంద్రమోడీ, ఎన్డీఏ ప్రభుత్వం స్వార్థం ఉంది అని విపక్షాలు ఆరోపలు చేస్తున్నాయని అవన్నీ ఊహాగానాలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కానీ దురుద్దేశాలు కానీ తమకు లేవు అని చెప్పుకొచ్చారు.ఈ బిల్లు కేవలం దేశ ప్రజల ప్రయోజనం కోసం, దేశ ప్రగతి కోసం తెచ్చిన బిల్లు మాత్రమే అని ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇచ్చారు.ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తే తనకే లాభం అని మహిళా రిజర్వేషన్ బిల్లుపై తనకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదు అని ప్రధాని నరేంద్రమోడీ సభలో ప్రసంగించారు.పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు.కానీ లోక్సభలో అమలు చేస్తుంటే అడ్డుకుంటున్నారు అని ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తే పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదు అంటూ ప్రధాని నరేంద్రమోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్దతిచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ ‘దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయి. ఇది అలాంటి సమయమే. 30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు…ఇప్పుడు సభ ముందుకు వచ్చింది’అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.‘మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేదే మా లక్ష్యం. దేశానికి మేం కొత్త దిశను చూపిస్తున్నాం. వికసిత్ భారత్ అంటే కేవలం మౌలిక వసతుల కల్పన కాదు.మహిళలను అందులో భాగస్వాములను చేయడమే లక్ష్యం’అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీలన్నీ మద్దతిచ్చాయి. బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ ఉంటుంది. 30ఏళ్లలో ఇదే రుజువైంది. పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు.లోక్సభలో అమలుచేస్తుంటే అడ్డుకుంటున్నారు’అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.‘మహిళల్లో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. పంచాయతీల్లోనే కాదు అత్యున్నత చట్టసభల్లోనూ..భాగస్వామ్యం కోరుకుంటున్నారు’అంటూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు.