జనం న్యూస్ : మాజీమంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా గౌరవం ఇచ్చిందని అయితే స్థానికంగా జరిగిన చిన్న సమస్యలతో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారని అన్నారు. జీవన్ రెడ్డి పునరాలోచించుకోవాలని హితవు పలికారు. మాజీమంత్రి జీవన్ రెడ్డిపై తెలంగాణ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి అంటే ఇప్పటికీ తమకు గౌరవం అని చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా గౌరవమిచ్చాం అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.స్థానికంగా జరిగిన చిన్న సమస్యలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు అని చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని…ఆయినా అంతటి పెద్ద నాయకుడు ఇలాంటి తప్పు చేస్తారని ఊహించలేదని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం దక్కిందని మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి గుర్తు చేశారు. కేసీఆర్‌పై పోరాటం చేసి ఆయన చెంతకు చేరతారా? మాజీమంత్రి జీవన్ రెడ్డి కేవలం స్థానికంగా ఉన్న చిన్నపాటి సమస్యల కారణంగా దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీని వీడటం సరికాదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు.‘ఇన్నేళ్లుగా కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన జీవన్ రెడ్డి… ఇప్పుడు అదే కేసీఆర్ పక్కన కూర్చోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నవ్వుల పాలయ్యే పనులు జీవన్ రెడ్డి స్థాయికి తగవు అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి జీవన్ రెడ్డి తప్పు చేశారని అన్నారు. లెక్కలతో సహా బీఆర్ఎస్ అవినీతిని తమకంటే ఎక్కువ జీవన్ రెడ్డియే చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్లడాన్ని జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జీవన్ రెడ్డి పునరాలోచించుకోవాలి. పార్టీ వీడినప్పటికీ ఇప్పటికీ జీవన్ రెడ్డిపై తమకు ఇంకా గౌరవం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే పార్టీకి, ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిదని మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు.