అమ్మాయిల ఆరోగ్యానికి కేంద్రం మద్దతు

ఏపీకి 1.90 లక్షల హెచ్‌పీవీ టీకాలు

జనం న్యూస్: ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. గర్భాశయ ముఖ ద్వార(సర్వైకల్ క్యాన్సర్) బారి నుంచి తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 15 ఏళ్ల బాలికల కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బాలికలకు ఇప్పటికే వ్యాక్సిన్‌లు ఇస్తోంది. ఇందులో భాగంగా తొలివిడత కింద గత నెలలో 1,90,800 డోసుల హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను పంపించింది.ఇందుకు అదనంగా తాజాగా 1,90,890 డోసుల వ్యాక్సిన్‌ను రాష్ట్రానికి పంపింది. ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో 1,90,890 డోసుల హె చ్ పీ వీ వ్యాక్సిన్‌ను పంపించింది. గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్ క్యాన్సర్) బారి నుంచి తప్పించేందుకు 14-15 ఏళ్ల బాలికల కోసం కేంద్రం తొలివిడత కింద గత నెలలో 1,90,800 డోసుల HPV వ్యాక్సిన్ ను పంపింది. ఇందుకు అదనంగా మరో 1,90,890 డోసుల వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ను సదరు జిల్లాల్లోని బాలికల సంఖ్యకు అనుగుణంగా పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. వచ్చే మే నెల వరకు బాలికలకు నిరాటకంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసినందున వ్యాక్సిన్ పంపిణీలో మరింత వేగం పెరుగుతుంది. ఇప్పటికే 1.14 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ. గ్రామ/వార్డు సచివాలయాల్లో రికార్డుల ఆధారంగా 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15 ఏళ్లు దాటని బాలికలు రాష్ట్ర వ్యాప్తంగా 3.45 లక్షల మంది ఉన్నారు. వీరిలో సోమవారం మధ్యాహ్నం వరకు 1,14,512 (33.19%) మంది బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చారు. అత్యధికంగా కర్నూలు జిల్లా-6,785, నెల్లూరు జిల్లాలో 6,726, వైఎస్ఆర్-6,725, అనంతపురం జిల్లాలో 6,655 మంది బాలికలకు చొప్పున వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. తక్కువగా పోలవరం జిల్లా-669, అల్లూరి సీతారామరాజు-1,063, శ్రీ సత్యసాయి-2,769, అనకాపల్లి జిల్లాలో 2,959 మందికి చొప్పున వ్యాక్సిన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ వాక్సిన్ పంపిణీ నిరాటకంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో కోల్డ్ చైన్ (వ్యాక్సిన్ భద్రపరిచే) సౌకర్యం ఉన్నట్లు గుర్తించిన ప్రాథమిక ఆరోగ్య, పట్టణ ఆరోగ్య కేంద్రా(1,645)ల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు. టీకా ఇచ్చిన అనంతరం బాలికలను 30 నిమిషాలపాటు అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి రియాక్షన్ కేసెస్ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. మొత్తం 3.81 లక్షల డోసుల వాక్సిన్ రాక. కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి బాలికలకు వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. గర్భాశయ ముఖ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ హెచ్‌పీవీ టీకా సురక్షితమైనది. ప్రభావవంతమైంది. రెండు విడతలుగా కలిపి రాష్ట్రానికి కేంద్రం నుంచి 3,81,780 డోసుల టీకా వచ్చింది. మరోవైపు కేంద్రoనుంచి వచ్చిన ఆదేశాల మేరకు తొలి విడతలో వచ్చిన వాక్సిన్‌లో 500 డోసులను యానాంకు అధికారులు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *