సాక్షి డిజిటల్ న్యూస్ : పురుషులతో పాటు సమానంగా మహిళలు ఆర్థిక ఉత్పాదక శక్తిగా ఆవిర్భవించేందకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది అని వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా ‘శిశు పాలనలో సమాజ బాధ్యత’అన్న నినాదం ద్వారా పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ మార్పు తేవాల్సి ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమలులో ఉన్న 180 రోజుల ప్రసూతి సెలవుల్ని 12 నెలల పేరెంట్ హుడ్ లీవ్‌గా తల్లిదండ్రులిద్దరూ సమానంగా వాడుకునే వీలు కల్పిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.పలు సామాజిక, ఆర్థిక పరిమితులతో వివక్షకు గురవుతున్న మహిళలకు సాధికారిత(ఎంపవర్మెంట్) ద్వారా రాష్ట్ర ప్రగతిలో వారికి భాగస్వామ్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించింది. సుదీర్ఘ కాలంపాటు రాష్ట్ర సమగ్ర ప్రగతికి బాటల వేసే దిశగా ప్రభుత్వం రూపొందించిన నూతన ‘జనాభా స్థీరికరణ’ విధానంలో భాగంగా మహిళా సాధికారత కోసం ఈ 10 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం పత్రికా ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రగతికి కీలకమైన నూతన జనాభా నిర్వహణలో మహిళల కీలక పాత్రను గుర్తించిన కూటమి ప్రభుత్వం పక్కా విధానాన్ని రూపొందించినట్లు మంత్రి వివరించారు. గర్భధారణ మరియు శిశు సంరక్షలను మహిళా హక్కుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి జీవన అన్ని దశల్లోనూ అండగా ఉండి, అనుకూల వాతావారణాన్ని కల్పించి, లింగ వివక్షకు తెరదించివ సమాజా వికాసంలో మహిళా శక్తికి తమ పాత్రను పూర్తి స్థాయిలో నిర్వహించేలా చూసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.స్త్రీ శక్తి ఆవిష్కరణకు పది సూత్రాలు మహిళల జీవనంలోని అన్ని దశల్లోనూ నాణ్యమైన సేవల్ని అందుబాటులో ఉంచి వారికి సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడం…సంతాన ప్రాప్తి హక్కును సరైన విధానంలో సాకారం చేయడం, ఆర్థిక స్వావలంబనకు వారికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించడం, శిశు సంరక్షణలో పురుషుల్ని భాగస్వాములు చేయడం ఈ పది సూత్రాల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.స్త్రీ అనుకూల పని వాతావరణ కల్పన పురుషులతో పాటు సమానంగా మహిళలు ఆర్థిక ఉత్పాదక శక్తిగా ఆవిర్భవించేందకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా…ఆరేళ్ల వయసు వరకు శిశువుల సంరక్షణ కోసం 50 మందికి పైగా ఉద్యోగులుండే ప్రతి చోటా శిశు పాలనా కేంద్రాల్ని (క్రెష్‌లు) ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా చర్యల్ని ప్రతిపాదించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాటితో పాటు…ప్రతి లక్ష జనాభాకు ఒకటి చొప్పున ‘వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్’ ను పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోబడతాయి అని అన్నారు. ప్రస్తుతం…శిశు పాలనా కేంద్రాల బాధ్యత ప్రధానంగా మహిళలపైనే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రస్తుత సామాజిక విలువల్లో తగు చైతన్య కార్యక్రమాల ద్వారా మార్పు తెచ్చి ‘శిశు పాలనలో సమాజ బాధ్యత’ అన్న నినాదం ద్వారా పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ మార్పు తేవాల్సి ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ దిశగా ప్రస్తుతం అమలులో ఉన్న 180 రోజుల ప్రసూతి సెలవులను(మెటర్నటీ లీవ్) 12 నెలల పేరెంట్ హుడ్ లీవ్ గా తల్లిదండ్రులిద్దరూ సమానంగా వాడుకునే వీలు కల్పిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.సంతాన ప్రాప్తి హక్కు గుర్తింపు ‘సంతాన ప్రాప్తి హక్కు ప్రతి జంట ఆకాంక్ష. హక్కు అని, అయితే రాష్ట్రంలో దాదాపు 12 లక్షల కుటుంబాలు సంతాన వైఫల్యంతో పలు సమస్యలకు గురవుతున్నారని ఈ సమస్యకు పరిష్కారంగా అట్టి కుటుంబాలకు సంతానోత్పత్తి సేవల్ని ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సాలీనా 50,000 కుటుంబాలకు ఈ సేవల్ని ఉచితంగా అందజేసే విధంగా ప్రభుత్వం తగు చర్యల్ని తసుకుంటుందని ఆయన అన్నారు.