అక్షర ఆయుధం : వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్రిమినల్, దోపిడీ, విధ్వంసం, అవినీతి క్రెడిట్‌ను ఎవ్వరూ చోరీ చేయలేరు అని చెప్పుకొచ్చారు.సొంత బాబాయిని చంపి, పిన్నమ్మ తాళి తెంచిన వారిని కాపాడుతున్న వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.రాష్ట్రానికి రాజధాని ఉండడం వైసీపీ నేతలకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు. ప్రజా రాజధాని అమరావతి కేంద్రంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.జగన్ క్రిమినల్ క్రెడిట్‌ను ఎవ్వరూ చోరీ చేయలేరు అని చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్ అని దాని దరిదాపులకు కూడా జగన్ చేరుకోలేడని ఏపీ ఎక్సైజ్ మరియు గనుల శాఖ మంత్రివర్యులు కొల్లు రవింద్ర దుయ్యబట్టారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కూటమి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల క్రెడిట్‌ను జగన్ చోరీ చేయడంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…“ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంగా నిలిచింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఒక వైపు సంక్షేమాన్ని, మరో వైపు అభివృద్ధిని చేస్తున్నాం. దేశానికే పాలనలో ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచింది. ప్రభుత్వం తలపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నా.. వాటి క్రెడిట్‌ను కొట్టేసే పనిలో జగన్ రెడ్డి ఉన్నాడు. చంద్రబాబు, లోకేష్ బాబు కృషి వలనే ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే.. ఆ కంపెనీతో నేనే మాట్లాడాను.. నేను తెచ్చిన కంపెనీలే ఇవి అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. నిజంగా 2021లో జగన్ ఆర్సెలార్ మిట్టల్‌తో మాట్లాడి పెట్టుబడుల ఒప్పందం చేసుకొని ఉంటే 2024 వరకు ఎందుకు గ్రౌండ్ చేయించలేకపోయారు? కడప స్టీల్ ప్లాంట్‌ను కూడా పూర్తి చేయలేని క్రెడిట్ జగన్‌ది. చరిత్రలో చరిత్రహీనులుగా జగన్ రెడ్డి మిగిలిపోయాడు. జగన్ తరిమేసిన సంస్థలను కూడా మేము తిరిగి తెస్తున్నాం. చంద్రబాబు బ్రాండ్ వలన రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్, ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్ వంటి గొప్ప సంస్థలు వస్తున్నాయి’అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. క్రిమినల్ క్రెడిట్ జగన్‌ది… అభివృద్ధి క్రెడిట్ చంద్రన్నది జగన్‌పై తీవ్ర విమర్శలు… “క్రిమినల్” అంటూ మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర“తన అవలక్షణాలను ఎదుటివారిపై అంటగట్టి, చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పి మభ్య పెట్టడమే జగన్ నైజం. అవే అబద్ధాలను ఆయన సైకో బ్యాచ్ మోస్తూ ఉంటుంది. జగన్ క్రిమినల్, దోపిడీ, అవినీతి, విధ్వంసాల క్రెడిట్ ను ఎవ్వరూ చోరీ చేయలేరు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రజా వేదికను కూల్చారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. రూ.32 వేల కోట్లు ప్రజలపై భారం మోపారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులను, నదుల అనుసంధానాన్ని అటకెక్కించారు. ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనుకున్న ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అడ్డుపడి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు. ఉద్యమం చేసిన రైతులపై దాడులు చేశారు. చంద్రబాబు కృషితో రాష్ట్రానికి వచ్చిన అనేక పరిశ్రమలను కమిషన్ల కోసం కకృత్తి పడి తరిమేశారు. జగన్ స్వార్ధ ప్రయోజనాల కోసం అధికారులను, సహచరులను ఇరికించాడు. రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టి, స్వార్థ రాజకీయాలు, అక్రమాస్తులను కాపాడుకోవడం కోసం ప్రజా ధనాన్ని వాడి తన కేసులను జగన్ వాదించుకున్నాడు. వెలిగొండ ప్రాజెక్టు కోసం చంద్రబాబు వేగంగా పనులు చేస్తుంటే.. అది నేనే పూర్తి చేశానని అవాస్తవాలు పలుకుతున్నాడు. సుమారు 5 వేల కోట్ల ఖర్చు అయ్యే వెలిగొండ ప్రాజెక్టుకు ఐదేళ్లలో జగన్ రెడ్డి కేటాయించింది కేవలం రూ.500 కోట్లే. నేడు రూ.4,500 కోట్లతో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. ఆ క్రెడిట్‌ను కూడా జగన్ చోరీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. సొంత బాబాయిని హత్య చేసి, పిన్నమ్మ మెడలో తాళి తెంచిన హంతకులకు జగన్ అండగాస్తున్నాడు. బాబాయి హత్య కేసులు జగన్ ఆడించిన డ్రామాల క్రెడిట్‌ను ఎవ్వరూ కోరుకోరు. ఆ క్రెడిట్ కేవలం జగన్‌కే దక్కుతుంది. సొంత తల్లి, చెల్లిని రోడ్డున పడేసిన క్రెడిట్ జగన్‌ది. జగన్ తన అక్రమార్జన కోసం నకిలీ మద్యం ద్వారా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. నేడు భారతదేశంలోనే రూ.3,500 కోట్ల అతిపెద్ద స్కాం.. జగన్ హయాంలోనే జరిగింది. ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మహిళల మాంగల్యలను మంటగల్పాడు. ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్, గంజాయి ద్వారా కోట్లు దండుకున్నాడు. యువతకు ఉద్యోగాలు దొరకకుండా చేసి గంజాయికి బానిసలను చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా చేసి, రాజకీయ లబ్ది చేకూర్చుకోవాలని చూస్తున్నారు. ప్రజలు వైసీపీకి 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దాంతో రాష్ట్ర ప్రజలు వీరికి 11 సీట్లే ఎక్కువ అని దిగ జార్చిన క్రెడిట్ జగన్‌ది” అని మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు.అమరావతిపై వైసీపీకి ఎందుకంత విద్వేషం? “గతంలో అమరావతి ఒక స్మశానం.. బూత్ బంగ్లాలే ఉంటాయి.. ఎందుకూ పనికిరానిదని ప్రజా రాజధానిపై విషం చిమ్మారు. నేడు కూటమి ప్రభుత్వం రాకతో అమరావతి వైభవంగా వెలుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నిజం చేయడమే కాదు శాశ్వతం చేయడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత తీసుకువచ్చేలా సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ చర్యలు తీసుకున్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై అసెంబ్లీకి వచ్చి చర్చించకుండా బయట నోటికి వచ్చినట్లు బొత్స సత్యనారాయణ, ధర్మాన ద్వారా జగన్ మాట్లాడిస్తున్నాడు.