ఇంటర్ ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందన

ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలకు పెద్ద గుర్తింపు

అక్షర ఆయుధం ; ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న అత్యున్నత సేవలకు దక్కిన ఫలితం ఇది. దీనికి కారణమైన ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు, కళాశాల బోధనా సిబ్బందికి, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా అభినందనలు… ఇదే ఉత్సాహం, ఇదే సేవా స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీయేట్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.‘ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్ధులకు నా అభినందనలు. అన్ని విభాగాల నుంచి పదుల సంఖ్యలో విద్యార్ధులు అత్యధిక మార్కులు, టాప్ ర్యాంకులతో ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. సీనియర్ ఎంపీసీ నుంచి 2, 3 రాష్ట్ర ర్యాంకులతో పాటు జూనియర్ ఎంపీసీలో 10 మంది విద్యార్ధులు, జూనియర్ బైపీసీలో 11 మంది విద్యార్ధులకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయి’అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.‘అలాగే జూనియర్ ఎంఈసీలో 3, 4 ర్యాంకులు, జూనియర్ సీఈసీలో 5వ ర్యాంకు ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్ధులకు రావడం గర్వకారణం. ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న అత్యున్నత సేవలకు దక్కిన ఫలితం ఇది. దీనికి కారణమైన ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు, కళాశాల బోధనా సిబ్బందికి, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా అభినందనలు… ఇదే ఉత్సాహం, ఇదే సేవా స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా ఇకపోతే తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్… ఇంటర్ బోర్డు ఆదివారం (ఏప్రిల్ 12) రోజున ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు-2026ను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విడుదల చేశారు. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌‌లు https://tgbie.cgg.gov.in, https:// results.cgg.gov.in ‌లలో ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 66.2 శాతం, సెకండియర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. అయితే ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.4 కాగా, బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది. ఇంటర్ సెకండియర్‌లో బాలికల ఉత్తీర్ణత శాతం 78.65 కాగా, బాలురు ఉత్తీర్ణత 62.50 శాతంగా నమోదైంది. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్ ఫలితాలు వెల్లడికావడంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించి షెడ్యూల్ కూడా ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. అలాగే, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఇంటర్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు రేపటి (ఏప్రిల్ 13) నుంచే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్టుగా అధికారులు తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 20 చివరి తేదీగా పేర్కొన్నారు. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుము ఒక్కో సబ్జెక్టుకు రూ.100గా ఉంది. అయితే స్కాన్ చేసిన ఆన్సర్ షీట్ కాపీతో పాటు రీవెరిఫికేషన్ కోసం అయితే ఒక్కో సబ్జెక్టుకు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు ఏప్రిల్‌ 13 నుంచి 20 వరకు అవకాశం ఇస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది రెండు సెషన్‌లలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. రెండు షిప్ట్‌లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ప్రాక్టికల్ పరీక్షలు మే 22న ప్రారంభమవుతాయి. వీటిని కూడా రెండు షిప్ట్‌లలో నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *