జనం న్యూస్: తెలంగాణలో జిల్లాల సరిహద్దుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల సరిహద్దుల సమస్యలకు సంబంధించి 2027 మార్చి 31 తర్వాత జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో జిల్లాల సరిహద్దుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల సరిహద్దుల సమస్యలకు సంబంధించి 2027 మార్చి 31 తర్వాత జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో అధికార, ప్రతిపక్ష నియోజకవర్గాల తేడా లేకుండా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, కానీ భేదాభిప్రాయాలు ఉండకూడదని న్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా, రాజకీయాలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, రూ. 500 లకే సిలిండర్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ఈ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా పార్టీలను చూడలేదని… ప్రజల కష్టాలను మాత్రమే చూశామని తెలిపారు. 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వాడగా, పర్యాటక ప్రాంతంగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామమని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు చేయకపోవడం వల్ల వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని అన్నారు. జిల్లాలో అపారమైన జలవనరులు, అపారమైన ప్రాచీన సంస్కృతి ఉందని చెప్పారు. అయినప్పటికీ వ్యవసాయం విస్తరించలేదని విద్య, వైద్యం అందలేదు. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఉందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడానికి పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో మాట్లాడామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఇలా మాట్లాడే సంస్కృతి లేదని విమర్శించారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లా ఇంచార్జ్ మంత్రి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. 2027 మార్చి 31 వరకు గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ల, జిల్లా కేంద్రాల సరిహద్దులను మార్చడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వం కట్టడి విధించిందని సీఎంరేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల జిల్లాలు, మండలాల సరిహద్దు సమస్యలకు సంబంధించి జిల్లా ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు తర్వాత ప్రత్యేకంగా జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పరిశీలిస్తామని చెప్పారు.