జనం న్యూస్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖచిత్రంపై ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయవాడలో ప్రస్తుతం ఉన్న 2 పార్లమెంట్ 14 అసెంబ్లీ నియోజకవర్గంలు పునర్విభజన తర్వాత 3 పార్లమెంట్ 21 అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారుతుంది అంటూ ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు త్వరలోనే బిల్లును సైతం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్తగా పెరిగిన సీట్లతోనే 2029 ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖచిత్రంపై ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయవాడలో ప్రస్తుతం ఉన్న 2 పార్లమెంట్ 14 అసెంబ్లీ నియోజకవర్గంలు పునర్విభజన తర్వాత 3 పార్లమెంట్ 21 అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారుతుంది అంటూ ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఈ అంచనాలు కేవలం జియోగ్రాఫికల్ అంచనాలు మాత్రమే అని ప్రభుత్వం నుండి పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన సైంటిఫిక్ తరహాలో జరుగుతుంది అని రాసి ఉంది. కొత్త నియోజకవర్గాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖచిత్రం ఈ విధంగా మారబోతుంది. మచిలీపట్నం పార్లమెంట్ : 1.అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు) 2.చల్లపల్లి,(చల్లపల్లి, ఘంటసాల,మోపిదేవి) 3.మచిలీపట్నం,(సిటీ) 4.గుడివాడ, (గుడివాడ సిటీ, నందివాడ) 5.పామర్రు, పామర్రు, పమిడిముక్కల,పెడపారుపూడి) 6.పెడన (గూడూరు,పెడన, మచిలీపట్నంరూరల్) 7.బంటుమిల్లి. (గుడ్లవల్లేరు, బంటుమిల్లి, కృత్తివెన్ను) విజయవాడ పార్లమెంట్: 1.విజయవాడ ఈస్ట్, 2.వెస్ట్, 3.సెంట్రల్, 4.నార్త్, 5.పెనమలూరు, (పెనమలూరు, విజయవాడ అర్బన్) 6.గన్నవరం, (గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు) 7.ఉయ్యూరు. (ఉయ్యురు, తొట్లవల్లూరు, కంకిపాడు) నందిగామ పార్లమెంట్ : 1.కొండపల్లి, (ఇబ్రహీంపట్నం, కొండపల్లి, సిటీ రూరల్) 2.మైలవరం,(మైలవరం, జి.కొండూరు, వీరులపాడు) 3.తిరువూరు, (గంపలగూడెం, తిరువూరు, 4.నందిగామ, (కంచికచర్ల, నందిగామ) 5.జగ్గయ్యపేట, (సిటీ) 6.విస్సన్నపేట, (రెడ్డి గూడెం, ఏ.కొండూరు, విస్సన్నపేట) 7.పెనుగంచిప్రోలు.(వత్సవాయ్, పెనుగంచిప్రోలు, చందర్లపాడు) 263 స్థానాలకు పెరగనున్న ఏపీ అసెంబ్లీ రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకు వచ్చినప్పటికీ. ఇప్పటివరకు అమలుకాలేదు. తాజా పరిణామాలతో ఈ అంశం మళ్లీ రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన వచ్చింది కానీ ఇప్పటి వరకు దాని ప్రస్తావన రాలేదు. అయితే త్వరలోనే ఈ అంశానికి సంబంధించి బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని. 2029 నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. పునర్విభజన చట్టంలోని హామీల మేరకు అసెంబ్లీ స్థానాల పెంపు జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 175 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా… నియోజకవర్గ పునర్విభజన జరిగితే కొత్తగా 50 శాతం స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే 88 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. వీటితో కలుపుకుంటే ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 263కు చేరుకోనుంది. వీటిలో87 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్‌డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 38కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 2029కల్లా ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ క్రమంలో ఏపీలో కొత్తగా 13 లోక్‌సభ స్థానాలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఏపీలోక్ సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త స్థానాలతోనే 2029 ఎన్నికలు. అయితే నియోజకవర్గాల సంఖ్య పెంపు కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుచేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.