పవన్ కల్యాణ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న కమల్ హాసన్

తమిళనాడులో ఫలితం ఎలా?

అక్షర ఆయుధం : ప్రముఖ సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏను అధికారంలోకి తీసుకువచ్చేందుకు పోటీ నుంచి పవన్ కల్యాణ్ విరమించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వ్యూహాన్ని తమిళనాడులో కమల్ హాసన్ ఫాలో అవుతున్నారు. ఏపీలో వర్కౌట్ అయిన వ్యూహం తమిళనాడులో వర్కౌట్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాలి.ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు స్వయంగా ప్రకటించారు. అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. చెన్నైలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయిన కమల్‌హాసన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మతతత్వ శక్తులు రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న ఈ తరుణంలో…తమ నిర్ణయం త్యాగం కాదు, కర్తవ్యంగా కమల్ హాసన్ అభివర్ణించుకున్నారు. ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడమే తమ లక్ష్యం అని రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ ప్రకటించారు. డీఎంకేకు కమల్ హాసన్ మద్దతు ఇకపోతే 2026 ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకేకు మద్దతు ఇస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ స్వాగతించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమల్ గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. తమిళనాడు చరిత్ర ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున కమల్ హాసన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారని తెలిపారు. డీఎంకే పార్టీకి కమల్‌హాసన్ మద్దతు ప్రకటించడం ఇదేమీ కొత్తేమీ కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎంఎన్ఎం పోటీ చేయకుండా డీఎంకే కూటమికి బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ నుంచి నిష్క్రమిస్తూనే బహిరంగ మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్‌ తరహాలోనే కమల్ హాసన్ ఏపీలో కూడా ఇలాంటి రాజకీయమే జరిగింది. గతంలో 2014లో ఓటు చీలకూడదనే లక్ష్యంతో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. నేరుగా ఎన్డీఏ కూటమికి బహిరంగ మద్దతు ప్రకటించారు. అంతేకాదు కూటమి అభ్యర్థుల తరఫున కూడా ఎన్నికలప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇదే పాలసీని కమల్ హాసన్ సైతం అప్లై చేస్తున్నారు. బీజేపీకి అధికారం దక్కకూడదనే లక్ష్యంతో డీఎంకేతో కమల్ హాసన్ జట్టుకట్టారు. ఇప్పటికే పొత్తులో భాగంగా రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకున్న కమల్ హాసన్ రాజ్యసభలో తమ వాణిని బలంగా వినిపిస్తున్నారు. అయితే డీఎంకేను అధికారంలోకి తీసుకురావడమే పరమావధిగా తమ పార్టీ పోటీ నుంచి విరమించుకున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *