తెలంగాణలో కొత్త సంక్షేమ పథకం: కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

" బడ్జెట్, అమలు విధానం పూర్తి వివరాలు "

పయనించే సూర్యుడు న్యూస్ : కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్ట వశాత్తు.. ఆకస్మికంగా దూరమైతే.. ఆ కుటుంబం వీధిన పడకుండా భరోసా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా.. పేద, మధ్య తరగతి అనే వ్యత్యాసం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నామని… కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా భద్రత, భరోసా లభిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే ఆ కుటుంబంపడే మానసిక వేదన ఒకటైతే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, ఆ అభద్రతాభావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యంకాని రీతిలో, కనివిని ఎరుగని ఒక మహాత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ బృహత్తరమైన పథకానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 1.15కోట్ల కుటుంబాలకు జీవిత బీమా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం ప్రకారం అర్హులైన కుటుంబంలో ఇంటి పెద్దను కోల్పోతే వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయింపులు చేసినట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడే జీవించడం ఒక వరం… అనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది… సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి… ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల జీవిత బీమా పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నామో అనే దానిపైనా ఆర్థికశాఖ మంత్రి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించేశారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇది వరం అని.. తెలంగాణలో పుట్టటం.. జీవించటం అనేది వరం అనే విధంగా ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం భరోసా.. ప్రభుత్వం భద్రత కల్పించటానే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయానికి రూ.23,179 కోట్లు సివిల్ సప్లై శాఖకు రూ.7366 కోట్లు పశు సంవర్ధక శాఖకి రూ.1529 కోట్ల విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు విద్యా శాఖకి రూ.26, 674 కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు రూ.13679 కోట్లు కార్మిక శాఖకు రూ.998 కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖకి రూ.3143 కోట్లు గృహ నిర్మాణానికి రూ.7430 కోట్లు ఐటీ శాఖకు రూ.875 కోట్లు పరిశ్రమల శాఖకి రూ.3490 కోట్లు చేనేత శాఖకు రూ.258 కోట్లు షెడ్యూల్ కులాలకు రూ.11784 కోట్లు, షెడ్యూల్ తెగలకు రూ.7937 కోట్లు వెనక బడిన తరగతులకు రూ.12,511 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ.3769 కోట్లు రాజీవ్ యువ వికాసంకు రూ.6వేల కోట్లు పంచాయతీ రాజ్ శాఖ కు రూ.33,688 కోట్లు ఇరిగేషన్ కు రూ.22,615 కోట్లు రవాణా రోడ్డు భవనాల శాఖకి రూ.12,789 కోట్లు న్యాయ శాఖకు రూ.2367 కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు హోం శాఖకు రూ.11,907 కోట్లు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు పర్యాటక శాఖకు రూ.1224 కోట్లు 6 గ్యారంటీలకు 50,713కోట్లు రైతు భరోసాకు రూ.18,000 కోట్లు చేయుతకు రూ.14,861 కోట్లు ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) రూ. 2,080 కోట్లు రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.1,143 కోట్లు మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ రూ.723 కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ. 2,170 కోట్లు స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు తప్పనిసరి కార్యాలయ ఖర్చులు రూ.2,323 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *