టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు

సీఎం రేవంత్ రెడ్డి స్పందన

జనం న్యూస్: హైదరాబాద్ శివారు మెయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, కాల్పుల ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు మెయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, కాల్పుల ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పాల్గొన్న రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ‌సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి… మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ను స్టేషన్ బెయి‌ల్ దక్కడంపై స్పందించారు. పుట్టా మహేశ్‌కి స్టేషన్ బెయిల్‌ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని తెలిపారు. ఈ కేసును త్వరితగతిన, సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చారని అన్నారు. ఇదిలాఉంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లో వస్తాయని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం 2028 చివరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావాల్సి ఉందని అయితే ఎన్నికలు నాలుగైదు నెలలు వాయిదా పడే అవకాశం ఉందని అన్నారు. 2029లో దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి ఆ క్రమంలోనే 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడి, 2029లో కేంద్రంతోపాటు నిర్వహించే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వెంట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పార్లెమెంట్‌కు వెళ్లిన సమయంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఎదురుపడ్డారు. ఈ సందర్బంగా వారు ఒకరినొకరు పలకరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *