పయనించే సూర్యుడు న్యూస్ : 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో చేసిన పొరపాటు… అమరావతిలో చేయను అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సైబరాబాద్‌లో భూములపై పెట్టుబడులు పెట్టాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు.ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ సందర్భంగా డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం సలహా పాటించక మంచి పెట్టుబడి అవకాశం కోల్పోయాను… అమరావతి విషయంలో ఆ తప్పు చేయను అని చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సలహా పాటించక హైదరాబాద్‌లో ఓ కీలక పెట్టుబడి అవకాశాన్ని, గొప్ప ఆదాయాన్ని కోల్పోయామని ప్రముఖ రియల్ ఎస్టేట్, హౌసింగ్ సంస్థ డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా చంద్రబాబు సూచించినా… భవిష్యత్‌ను సరిగ్గా అంచనా వేయలేక పెట్టుబడులు పెట్టలేదని రాజీవ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని రైసినా డైలాగ్ వేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ కొద్దిసేపు భేటీ అయ్యారు. వారి భేటీలో నాటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీఎం చంద్రబాబు దార్శనికత, సైబరాబాద్ నిర్మాణంతో రాయదుర్గం ప్రాంతం హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ కేంద్రంగా ఎదిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పెట్టుబడులకు రాజీవ్ సింగ్ ఆసక్తి నాడు భూములపై పెట్టుబడి పెట్టకుండా అవకాశం కోల్పోయానని… ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మితం అవుతున్న రాజధాని అమరావతిలో ఆ తప్పు పునరావృతం కానివ్వనని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో పెట్టుబడులకు రాజీవ్ సింగ్ ఆసక్తి వ్యక్తం చేశారు. త్వరలో అమరావతిని సందర్శించి పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తానని ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతితో పాటు విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని డీఎల్ఎఫ్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ రెండు నగరాలను అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను, పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. అప్పుడు కుటుంబ నియంత్రణ-ఇప్పుడు జనాభా నిర్వహణ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోందని.. ఆ ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడుతున్నామని సీఎం వివరించారు. భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 1.5 ఫెర్టిలిటీ రేటును 2.1 గా తీసుకెళ్లేందుకు పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకువచ్చామని సీఎం తెలియచేశారు. ప్రజాప్రతినిధిగా 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేసి ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి చర్చిస్తున్నామని తెలిపారు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఏజింగ్ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్థిక సాయం, నెల వారీగా రూ. వెయ్యి అందించాలని నిర్ణయించామని చెప్పారు. చైల్డ్ కేర్ లీవ్‌లాంటి ప్రోత్సాహకాలు ఆలోచిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించే సామర్ధ్యం భారత్ కు మాత్రమే ఉందని అన్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఇప్పుడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలో ఉన్న పెద్ద కుటుంబాలు దేశానికి పెద్ద ఆస్తి అని.. ప్రస్తుతం అవి మైక్రో ఫ్యామిలీలు గా మారాయన్నారు. ఈ విషయంలో ప్రజల దృష్టి కోణం మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ విభిన్నంగా ఆలోచన చేసే వారి కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని.. డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కూడా నిర్మిస్తున్నామని అన్నారు. సమీప భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు రానున్నాయని.. గతంలో ఊహగానే ఉన్న డ్రోన్ అంబులెన్సులు కూడా రియాలిటీలోకి వచ్చేశాయన్నారు. ఏఐ డేటా సెంటర్లతో ఏపీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ డెస్టినేషన్ గా ఏపీ తయారవుతుందని అన్నారు. మెరుగైన సదుపాయాలతో వ్యాపార అనుకూల ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దామని.. పెట్టుబడులతో వస్తే జాప్యం లేకుండా అనుమతులు ఇస్తున్నట్టు పేర్కోన్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సహా 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిఫుణులు, వ్యూహకర్తలు హాజరయ్యారు. 2016 నుంచి జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ సదస్సుకు తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్వాహకులు ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఈ రైసినా డైలాగ్ కు హాజరై తన అభిప్రాయాలను వివరించారు.