అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా

* “అన్నదాత సంతోషమే నా లక్ష్యం”-సీఎం రేవంత్ హృదయాన్ని తాకిన మాటలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి పంట కాలానికి రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదలకు ఈరోజు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి పంట కాలానికి రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదలకు ఈరోజు శ్రీకారం చుట్టనుంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో సాయంత్రం 4గంటలకు జరిగే సభలో రైతు భరోసా నిధుల విడుదలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని తెలిపారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నామని చెప్పారు. రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు… కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామని చెప్పారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఇక, రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పంట సీజన్‌కు ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రైతన్నల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్‌ కర్మాగారం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అయితే రైతు భరోసా నిధులను మూడు విడతల్లో రైతు ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 22న ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ఇందుకోసం రూ. 3,590 కోట్లు నిధులను 70 లక్షల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నట్టుగా పేర్కొంది. రెండో విడతకు సంబంధించి.. ఆ తర్వాత మ‌రో 20 రోజుల‌కు రూ. 2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక, మూడో విడతలో ఏప్రిల్ నెలాఖ‌రులోగా మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లోకి బ‌దిలీ చేయ‌నున్నట్టుగా వెల్లడించింది. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ. 9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *