అక్షర ఆయుధం : హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇంటి అద్దెభత్యం మినహాయింపు పరిమితిని 40 నుంచి 50 శాతానికి పెంచింది. ఇప్పటి వరకు మెట్రో నగరాలుగా పరిగణించబడుతున్న కోల్‌కత్తా, చెన్నై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో హెచ్ఆర్ఏ మినహాయింపు 50 శాతంగా ఉండేది. అయితే తాజాగా మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, ఫూణె, అహ్మదాబాద్‌లను చేర్చింది. దీంతో హైదరాబాద్‌లో నివశించే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 50శాతం వరకు మినహాయింపు ఉంటుంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) మినహాయింపును 50 శాతానికి పెంచింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే ఇప్పటి వరకు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై నగరాలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. దీంతో ఆయా నగరాల్లో హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి 50 శాతంగా ఉంటోంది. తాజాగా ఈ జాబితాలోకి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ చేరాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతాలలలో ఇంటి అద్దె భత్యం మినహాయింపును 50 శాతానికి పెంచింది. అయితే ఈ 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు ప్రయోజనం కేవలం పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అని గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. 50 శాతం వరకు హెచ్ఆర్ఏ మినహాయింపు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆదాయపు చట్టం ప్రకారం హైదరాబాద్‌లో నివసించే ఉద్యోగుల ఇంటి అద్దెభత్యం 50 శాతం మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 1 ఏప్రిల్ 2026 కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రకారం హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలను మెట్రో నగరాల జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది సాఫ్ట్‌వేర్, ఇతర రంగాల ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. గతంలో కేవలం ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నైలను మాత్రమే మెట్రోలుగా పరిగణించి, అక్కడ ఉండేవారికి ఇంటి అద్దె భత్యం (HRA) మినహాయింపును 50 శాతంగా ఇచ్చేవారు.తాజాగా ఆ వాటి జాబితాలోకి హైదరాబాద్ కూడా వచ్చి చేరింది. దీంతో హైదరాబాద్‌లో నివశించే ఉద్యోగులు తమ ప్రాథమిక జీతం (Basic Salary + DA)లో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ కింద పన్ను మినహాయింపు పొందనున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి రాబోయే కొత్త ఆదాయపు పన్ను నిబంధనలను నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది.2027 జూలైలో ఫైల్ చేయబోయే రిటర్నుల సమయంలో ఇది వర్తిస్తుంది.నికర ఆదాయం పెరిగే ఛాన్స్ హైదరాబాద్ వంటి మహానగరాల్లో గత ఐదేళ్లుగా ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. పాత నిబంధన ప్రకారం 40 శాతం పరిమితి ఉండటం వల్ల ఉద్యోగులు తాము చెల్లిస్తున్న పూర్తి అద్దెకు మినహాయింపు పొందలేకపోయేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పరిమితిని 40 నుంచి 50 శాతానికి పెంచడం వల్ల ట్యాక్స్ సేవింగ్స్ పెరిగి చేతికి వచ్చే నికర ఆదాయం పెరిగే అవకాశం ఉంది.భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ గొప్ప చారిత్రక నగరంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు కలిగి ఉంది. ఆనాటి కుతుబ్ షాహీల నుండి, నిజాం పాలకుల వరకు.. ఆధునిక కాలంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వంటి అద్భుతాలతో ఈ నగరం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ మరో చారిత్రాత్మక అడుగు వేస్తోంది. అదే 30 వేల ఎకరాలలో ఏర్పాటు చేసే “భారత్ ఫ్యూచర్ సిటీ”. రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్ సిటీని నేరుగాఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ వ్యవస్థ, పర్యావరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుచేశాం.ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి చేసుకుంటే, ఈ నగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలిచి, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుంది.