ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు జరగాలి

అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం అవుతున్నాయి అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సభ లోపల, బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు మంచిగా జరుగుతాయి అని తెలిపారు. ‘అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి’అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. ‘గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి.బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతమైనవి.ఎక్కువ రోజులు జరగడంతో పాటుగా, ఎక్కువ సమయం పాటు జరుగుతాయి’అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుండి అసెంబ్లీ,శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరియు శాసనమండలి కార్యదర్శి వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ GAD రాహుల్ బోజ్జా, ఫైనాన్స్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, స్పెషల్ సెక్రటరీ (ఫైనాన్స్) సిక్తా పట్నాయక్, డీజీపీ శివధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీకి చెడ్డపేరు తీసుకురావద్దు తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం అవుతున్నాయి అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సభ లోపల, బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు మంచిగా జరుగుతాయి అని తెలిపారు. ‘అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వానికి, శాసనసభకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి.శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి’అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. పోలీస్ శాఖ సహకరించాలి ‘శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరగడానికి పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకోవాలి’.సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలి, తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయి’అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ‘గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి.బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతమైనవి.ఎక్కువ రోజులు జరగడంతో పాటుగా, ఎక్కువ సమయం పాటు జరుగుతాయి’అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ, శాసనసభ అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రేపటి నుండి అసెంబ్లీ,శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరియు శాసనమండలి కార్యదర్శి వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ GAD రాహుల్ బోజ్జా, ఫైనాన్స్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, స్పెషల్ సెక్రటరీ (ఫైనాన్స్) సిక్తా పట్నాయక్, డీజీపీ శివధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీకి చెడ్డపేరు తీసుకురావద్దు తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం అవుతున్నాయి అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సభ లోపల, బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు మంచిగా జరుగుతాయి అని తెలిపారు. ‘అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వానికి, శాసనసభకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి.శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలి’అని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *