సాక్షి డిజిటల్ న్యూస్ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షులను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించడం, బెదిరింపులకు పాల్పడిన కేసులో అనంతబాబును శుక్రవారం రోజున రాజమహేంద్రవరం కోర్టు బయట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం సర్పవరం పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు. అనంతరం ఈరోజు ఉదయం కాకినాడ జీజీహెచ్‌లో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత కాకినాడ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో వేగం పెరిగింది. ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను సైతం పోలీసులు విచారించారు. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తాజాగా నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షులను బెదిరించడం ద్వారా అనంతబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. నలుగురు సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చుకోవడానికి అనంతబాబు తమకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తాము డబ్బు తీసుకోకపోవడం బెదిరింపులు ఎదుర్కొవాల్సి వచ్చిందని వారు తెలిపారు. తమను ఒక అపార్ట్మెంట్లో బంధించారని కూడా చెప్పుకొచ్చారు. తమ పాత వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలని, విచారణ సమయంలో తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా తాము అడ్వాన్స్‌గా అందుకున్న నగదును వారు పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల ఆధారంగా సాక్షులను ప్రభావితం చేయడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అనంతబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతబాబు ఇంటితో పాటు పలుచోట్ల పోలీసులు గాలింపు కొనసాగించారు. మంగళవారం సాయంత్రం నుంచి అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనంతబాబు ఇంట్లో వదిలేసి వెళ్లిన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ కోసం అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీ దుర్గ శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టుకు వచ్చారు. అయితే కోర్టు విచారణ ముగిసి బయటకు వచ్చిన తర్వాత అనంత బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అనంతబాబును సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉంటే, సాక్షులను బెదిరించానంటూ తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని అనంతబాబు గురువారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు.