అక్షర ఆయుధం ; ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం ఓ మహిళ కొంపముంచింది. సోషల్ మీడియాలో నిత్యం టచ్‌లో ఉండే ఇద్దరు కలుసుకోవాలని అనుకున్నారు. దీంతో మహిళ తన ఇంటికి ఆహ్వానించింది. తీరా ఇంటికి వచ్చాక అతగాడు తన బుద్ధి బయటపెట్టాడు. ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతగాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం ఓ మహిళ కొంపముంచింది. సోషల్ మీడియాలో నిత్యం టచ్‌లో ఉండే ఇద్దరు కలుసుకోవాలని అనుకున్నారు. దీంతో మహిళ తన ఇంటికి ఆహ్వానించింది. తీరా ఇంటికి వచ్చాక అతగాడు తన బుద్ధి బయటపెట్టాడు. ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతగాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.ఇకపోతే బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచర్ల టౌన్ పోలీసులు కేసు (Cr.No.34/2026 U/s 64(1), 127(2), 115(2) BNS) నమోదు చేశారు అని జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. తమ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) జె.వి. సంతోష్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు బాధితురాలి ఫోన్ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, ఏప్రిల్ 8వ తేదీ ఉదయం మాచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా…న్యాయమూర్తి రిమాండ్ విధించారు అని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. పోలీసులకు అభినందనలు ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, అత్యంత వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకున్న మాచర్ల పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. అసలేం జరిగిందంటే..సత్తెనపల్లికి చెందిన మహిళ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్నారు. ఉద్యోగ రీత్యా మాచర్ల పట్టణంలోని 13వ వార్డులో ఒంటరిగా ఉంటున్నారు. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె తన అక్క కుమారుడిని దత్తత తీసుకున్నారు. ఏప్రిల్ 2వ తేదీన సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి బలవంతంగా చొరబడి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. తొలుత నీళ్లు అడిగి ఆ తర్వాత ఇంట్లోకి చొరబడ్డాడని… ఆ తర్వాత అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం మహిళపై అమానుషంగా దాడి చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా మహిళకు గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో కేసు విచారణ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణతో పాటు, క్లూస్ టీమ్‌ను కూడా రంగంలోకి దించింది. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలితో మాట్లాడి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.‘ఇది హేయమైన, అమానుషమైన చర్య. ఆలస్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’అని రాయపాటి శైలజ అన్నారు.సీఎం చంద్రబాబు సీరియస్ ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడికి సాధ్యమైనంత కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.