సర్జరీ తర్వాత పవన్ పరిస్థితి ఎలా ఉంది?

మోదీ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురికావడంతో శస్త్రి చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ అసాధారణమైన ధైర్యశాలని పేర్కొన్న మోదీ… ఆయన చాలా త్వరలోనే కోలుకుంటారనే పూర్తి నమ్మకం తనకు ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ తనతో మాట్లాడటంపై పవన్ కల్యాణ్ సైతం స్పందించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… నా శస్త్ర చికిత్స తర్వాత మీరు నాతో స్వయంగా మాట్లాడినందుకు, ఆత్మీయంగా పలకరించినందుకు, నా ఆరోగ్యం అడిగి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మీరు చూపెట్టిన ఆత్మీయత, ప్రోత్సాహం, నేను త్వరగా కోలుకోవాలని మీరు శుభాకాంక్షలు తెలుపడం నాకు గొప్ప బలాన్ని ఇస్తున్నాయి. మీ నిరంతర మార్గ దర్శకత్వం, మద్దతు, నేను త్వరగా కోలుకోవాలని మీరు శుభాకాంక్షలు తెలియజేసినందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు శస్త్ర చికిత్స ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. పవన్ కల్యాణ్ శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న పవన్ కల్యాణ్… ఒక్కసారి అస్వస్థతకు గురికావడంతో తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలతోపాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. అలాగే, వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి అవసరమని సూచించారు. పది రోజులు తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని… పూర్తి ఆరోగ్యం చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి.. సీఎం చంద్రబాబు శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ త్వరితగతిన కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్ త్వరగా తిరిగి బలాన్ని పుంజుకుని, మునుపటి కంటే మరింత ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇక, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు విశ్రాంతి తీసుకోండి ప‌వ‌న‌న్న‌. నిత్య‌మూ రాష్ట్రాభివృద్ధి-ప్ర‌జాసంక్షేమమే ఆశ‌, శ్వాస‌గా ప‌నిచేసే మీరు త్వ‌ర‌లో పూర్తి ఆరోగ్య‌వంతులై ప్ర‌జాసేవ‌కు పున‌రంకితం కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను’’ అని లోకేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *