కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.

ఉద్యోగుల డీఏ పెంపు ఖరారు

జనం న్యూస్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ (Dearness Allowance) 2 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం (ఏప్రిల్ 18) రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో డీఏ పెంపు అంశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) 2 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ ఏడాది డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సాధారణం కంటే ఎక్కువ కాలం నీరిక్షించాల్సి వచ్చింది. సాధారణంగా డీఏ పెంపు నిర్ణయం మార్చి నెలల్లోనే వెలువడుతుంది. ఈ ఏడాది హోలీ పండుగ సమయంలోనే డీఏ పెంపు ప్రకటనపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి కాస్తా ఆలస్యంగానే డీఏ విడుదలైంది. గతంలో చివరి పెంపుతో డీఏ రేటు బేసిక్ శాలరీలో 58 శాతంగా ఉండేది. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో డీఏ‌ను 2 శాతం పెంచడంతో… ఇప్పుడు డీఏ 60 శాతానికి పెరిగింది. దీంతో ఉద్యోగుల చేతికి అందే జీతంలో పెరుగుదల కనిపించింది. ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సార్లు డీఏ సవరిస్తుంటుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ పెంపు జరుగుతుంది. ఉద్యోగులకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించడమే డీఏ పెంపు ప్రధాన లక్ష్యం. ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి ఉద్యోగులను రక్షించడానికి డియర్‌నెస్ అలవెన్స్ ఇవ్వబడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు… పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఖర్చులను వారు సులభంగా భరించగలిగేలా ప్రభుత్వం ఉద్యోగుల డీఏను పెంచుతుంది. డీఏ పెంపు అంటే.. నేరుగా ఉద్యోగుల జీతంలో పెంపు ఉంటుందని అర్థం. ఉద్యోగుల బేసిక్ జీతం ఆధారంగా ఈ పెంపుదల ఉంటుంది. ప్రస్తుత డీఏ పెంపు 2026 జనవరి 1 తేదీ నుంచి అమలులోకి రానుంది. అయితే డీఏ అనేది ప్రతి ఏడాది జనవరి, జులై నెలల్లో సవరించాల్సి ఉండగా… కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలస్యంగా మార్చిలో ఒకసారి తర్వాత సెప్టెంబర్- అక్టోబర్ మధ్యలో ఒకసారి డీఏ సవరిస్తూ వస్తోంది. అయితే ఆలస్యంగా సవరింపు చేసినప్పటికీ.. జనవరి 1, జూలై 1వ తేదీల నుంచే పెంచిన డీఏలు అమలులో వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *