
సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపికగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్ఎస్ అని చెప్పుకొచ్చారు. గులాబీజెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు అని మాజీమంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం మధ్య అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు.నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక...సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతికగా అభివర్ణించారు. పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక బీఆర్ఎస్ అని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చెప్పుకొచ్చారు. రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి. తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపికగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం అని అన్నారు. సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది ఒక్కటే ఆవాజ్ అని అన్నారు."రేవంత్ పోవాలి. కేసీఆర్ రావాలి” అని పిలుపునిచ్చారు. ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్ అని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ప్రతీ గుండెలో నాటుకుపోయిన గులాబీశక్తి బీఆర్ఎస్ పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్ఎస్ అని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చెప్పుకొచ్చారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదు అని చెప్పుకొచ్చారు. జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీవ్ రావు నినదించారు. ప్రజల మద్దతుతో పెద్ద తుఫాన్‌గా మారిన బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రస్ధానం ప్రారంభించిభారత రాష్ట్ర సమితిగా మారిన గులాబీ పార్టీ ఎన్నో మలుపులు తిరిగి, ఎన్నో పోరాటాలు చేసి, నేడు మరో చారిత్రక మైలురాయిని చేరుకోబోతోంది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనే తన మొదటి లక్ష్యంగా పెట్టుకుని జనాల్లోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్ఎస్ చేసిన పోరాటం ఏపీ రాజకీయాల్లో తొలకరి గాలిలా మారింది. తొలుత తక్కువ మంది తో ప్రారంభమైన ఈ ఉద్యమం, క్రమంగా లక్షలాది మంది ప్రజల మద్దతుతో పెద్ద తుఫానుగా మారిన సంగతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక స్థానం ఉద్యమం మధ్యలో వచ్చిన అవమానాలు, విమర్శలు, రాజకీయ కుట్రలన్నింటిని అధిగమిస్తూ బీఆర్ఎస్ గళాన్ని మరింత బలంగా ప్రజల్లోకి చొప్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది అని బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది.కేసీఆర్ తిరుగులేని సంకల్పం, నిరంతర పోరాటం ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోజు నుంచి తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక స్థానం లభించింది అని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధ పాలన వల్ల తిరోగమన దిశలో పయనిస్తున్న తెలంగాణను కాపాడు కునేందుకు హైదరాబాద్ లో జరగనున్న పార్టీ మహాసభలో కేసీఆర్ చేసే దిశా నిర్ధేశం కోసం పార్టీ కేడర్ ఆతృంగా ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది.