
సాక్షి డిజిటల్ న్యూస్: శంకర్ గౌడ్ అమరుడైన రోజును “అప్పాయింటెడ్ డే”గా ప్రకటించి. ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండి అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ‘ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేశారు.’ఈ సందర్భంగా శంకర్ గౌడ్‌కు అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.‘హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలి తప్ప, ఇలాంటి ఆత్మబలిదానాలకు ఎవరూ ఒడిగట్టవద్దని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. శంకర్‌కు గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది’అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ మాట తప్పడం వల్లే ఈ దుస్థితి. ‘అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని ఇతర అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడంవల్లనే ఈ దుస్థితి వచ్చింది’అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ‘మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు సైతం అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి? ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన ఆవేదనను పరిగణలోకి తీసుకొని, ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించి, కార్మికుల్లో విశ్వాసం కల్పించాలి’అని మాజీమంత్రి డిమాండ్ చేశారు.‘శంకర్ గౌడ్ అమరుడైన రోజును “అప్పాయింటెడ్ డే”గా ప్రకటించి...ఆయన త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరు చేస్తున్న పోరాటానికి మేమంతా అండగా ఉన్నాం. అధైర్యానికి లోనుకాకండి. కలిసికట్టుగా, న్యాయబద్ధంగా పోరాడి మన హక్కులను సాధించుకుందాం. ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు’అని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ న్యాయమైన 32 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఒకవైపు సమ్మె చేస్తూనే మరోవైపు ఆర్టీసీ బస్ డిపోల వద్ద, బస్టాండ్‌ల వద్ద నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో 80 శాతం కాలిన గాయాలవ్వడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. తోటి ఉద్యోగులు అతడిని వరంగల్ ఎంజీఎంఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. అయితే మార్గమధ్యలో కర్మాన్ ఘాట్ వద్ద డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణాలొదిలాడు. ప్రస్తుతం శంకర్ గౌడ్ మృతదేహం కంచన్ బాగ్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో ఉంచినట్లు తెలుస్తోంది.నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే శంకర్ గౌడ్ మనస్తాపం చెందారని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు.