
అక్షర ఆయుధం : తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కో శంకర్ గౌడ్ మరణం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున స్థానిక ఆర్డీవో ఉమారాణి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కో శంకర్ గౌడ్ మరణం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంకర్ గౌడ్ కుటుంబానికి సంతాపం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, వారికి అండగా ఉంటామని ప్రకటించింది. శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున స్థానిక ఆర్డీవో ఉమారాణి సాయం ప్రకటించారు. శంకర్ గౌడ్ మృతదేహాన్న ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు తరలించారు. అయితే ముత్తోజిపేటకు వెళ్లిన స్థానిక ఆర్డీవో ఉమారాణి, ఇతర అధికారులు శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఉమారాణి మీడియాతో మాట్లాడుతూ... శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తున్నట్టుగా తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్టుగా తెలిపారు. ఇక, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా శంకర్ గౌడ్ కుటుంబానికి అదనంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టుగా చెప్పారు. ఇక, ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ఆర్టీసీ జేఏసీ నేతల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి రూ. 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని నేతల విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే, ముత్తోజిపేటకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ముత్తోజిపేటకు చేరుకుని ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బండి సంజయ్ రాకతో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ముత్తోజిపేటకు తరలివచ్చారు. మరోవైపు ముత్తోజిపేటకు బయలుదేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు శంకర్ గౌడ్ మృతదేహాన్ని చివరగా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పిస్తామని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసు కుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. దీంతో ముత్తోజిపేటలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి...ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.