
అక్షర ఆయుధం వారణాసి: భారతదేశంలో మానవ హక్కులు మరియు సమాచార హక్కు (ఆర్.టీ.ఐ) అవగాహనను మరింత విస్తరించేందుకు కీలకంగా నిలిచే ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ లోగో పోస్టర్‌ను ఈ రోజు వారాణసిలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో, పూజా కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పవిత్ర క్షేత్రాలైన కాశీ విశ్వనాథ మందిరం , కాలభైరవ మందిరం , కాశీ విశాలక్షి మందిరం , అన్నపూర్ణ దేవి మందిరం మరియు శ్మశాన నాథ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు దేశ ప్రజలకు న్యాయం, సమానత్వం మరియు హక్కుల పరిరక్షణకు సంకల్పంగా జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.హెచ్.ఆర్ ఆర్ టీ ఐ కౌన్సిల్ వ్యవస్థాపకుడు మరియు జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, “మానవ హక్కులు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. ఆర్ టీ ఐ ద్వారా పారదర్శకత పెంచడం, ప్రజలకు న్యాయం అందించడం మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. అదేవిధంగా ప్రముఖ జర్నలిస్టులు కుంచం రమేష్ , లక్ష్మి నారాయణ (లచ్చీ), మల్లు గౌతమ్ రెడ్డి మరియు అజ్మతుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ప్రత్యేక అంశాలు: • దేశవ్యాప్తంగా మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు • యువతను ఆర్ టి ఐ మరియు హ్యూమన్ రైట్స్ రంగంలోకి తీసుకురావడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. • సభ్యులకు సర్టిఫికేట్లు, ఐడి కార్డులు, మరియు సామాజిక సేవలో భాగస్వామ్యం కల్పించే కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. • గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు న్యాయ అవగాహన పెంచే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ లోగో ఆవిష్కరణతో కౌన్సిల్ కార్యకలాపాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయని, సమాజంలో న్యాయం మరియు హక్కుల పరిరక్షణకు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
