
సాక్షి డిజిటల్ న్యూస్: ‘రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని తిట్టని మహిళ లేదు. మహిళా బిల్లును అడ్డుకుని ఏదో సంబురపడుతున్నారు. రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెడుతున్నారు’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.‘తెలంగాణలోనూ మహిళలకు నెలకు రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్ రెడ్డిని గద్దె దించండి’అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడంతోపాటు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని భావించి సంబురాలకు సిద్ధమైన దేశ మహిళల ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. పులి పంజా విసిరేటప్పుడు ఒక అడుగు వెనకకు వేస్తోందని, అంత మాత్రాన ఓడినట్లు కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం మహిళా బిల్లు విషయంలో ఒక అడుగు వేశారని, రెట్టించిన ఉత్సాహంతో మరో 10 అడుగులు ముందుకేసీ రాబోయే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగిన ‘‘మహిళా ఆక్రోశ్ పాదయాత్ర’’లో కేంద్రహోంశాఖ సహాయశాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కూటమి నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని తిట్టని మహిళ లేదు. ‘రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని తిట్టని మహిళ లేదు. మహిళా బిల్లును అడ్డుకుని ఏదో సంబురపడుతున్నారు. రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెడుతున్నారు. ప్రకృతిలో తల్లిని కొలిచి పూజించే సనాతన ధర్మం మనది’కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పుకొచ్చారు. గోమాత, భూమాత సహా దేవుళ్లను సైతం సతీసమేతంగానే పిలుస్తాం. ‘మోడీ ప్రభుత్వం సైతం మహిళల పేరుతోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలే కాకుండా రాజకీయ ప్రాధాన్యమిచ్చి చట్టసభల్లో అడుగుపెట్టేలా చేయాలనే ఉద్దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిని అడ్డుకుని విపక్షాలు విర్రవీగుతున్నాయి. పులి పంజా విసిరేటప్పుడు ఒక్క అడుగు వెనుకకు వేస్తోంది. ఆ తరువాత 10 అడుగులు ముందుకేసీ పంజా విసురుతుంది. రాబోయే ఎన్నికల్లోపే మహిళా బిల్లును అమలు చేసి తీరుతాం. మోడీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళల ఆశలపై నీళ్లు చల్లిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ‘మహిళా బిల్లును అడ్డుకునే పార్టీలన్నీ కుటుంబ వారసత్వ పార్టీలే. సోనియాగాంధీ, ఇందిరాగాంధీ, కనిమొళి, డింపుల్ యాదవ్, సుప్రియా సూలే పార్లమెంట్లో ఉంటే చాలు.సాధారణ మహిళలకు చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత లేదని కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఎన్సీపీ పార్టీలు చెబుతున్నాయి’అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అందుకే మహిళా బిల్లును అడ్డుకున్నాయి. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందుతుందని సంబురాలకు సిద్ధమైన మహిళల ఆశలపై నీళ్లు చల్లిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ముమ్మాటికి మహిళా పక్షపాతి. ‘తెలంగాణలోనూ మహిళలకు నెలకు రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్ రెడ్డిని గద్దె దించండి. అందులో భాగంగా మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయండి’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.‘మహిళా ఆక్రోశం ఏమిటో తెలిసేలా రేవంత్ రెడ్డికి చురకలు అంటించాల్సిన అవసరం ఉంది. ఇకనైనా బుద్ది తెచ్చుకుని మహిళా బిల్లుకు మద్దతు తెలిపాలని సూచిస్తున్నా. నరేంద్రమోదీ ప్రభుత్వం ముమ్మాటికీ మహిళా పక్షపాతి. రాష్టపతిగా, ఆర్ధిక మంత్రి బాధ్యతలను మహిళలకు అప్పగించడమే నిదర్శనం’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.