ఉగ్రవాదంపై మరోసారి కఠిన సందేశం

పహల్గామ్ దాడిపై మోడీ ట్వీట్ వైరల్

సాక్షి డిజిటల్ న్యూస్: పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగి ఇవాళ్టికి ఏడాది పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్‌ తలొగ్గదు. ఉగ్రవాదుల కిరాతక కుట్రలు ఎప్పుడూ సఫలం కాలేవు’అని ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగి ఇవాళ్టికి ఏడాది పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా స్పందించారు.‘పహల్గామ్‌ దాడిలో మరణించిన అమాయకులను ఎన్నటికీ మరిచిపోము. వారిని స్మరించుకుందాం. ఆ దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా సానుభూతి. దుఃఖ సమయంలోనూ మనం ఐక్యంగా నిలబడాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్‌ తలొగ్గదు. ఉగ్రవాదుల కిరాతక కుట్రలు ఎప్పుడూ సఫలం కాలేవు’అని ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. పహల్గామ్‌ దాడికి ఏడాది. ఇకపోతే గతేడాది ఇదే రోజున జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ పట్టణంలోని బైసరన్ వద్ద జరిగిన ఘోరమైన ఉగ్రదాడి జరిగింది.ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువ మంది పర్యాటకులే ఉన్నారు. వీరిలో తెలుగువారు సైతం ఉన్నారు. బైసరన్‌లో పర్యాటకులు ఎంజాయ్ చేస్తుండగా సమీపంలోని అడవుల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఉగ్రవాదులు దాదాపు 40 మంది పర్యాటకులను చుట్టుముట్టారు. విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. ఉగ్రదాడి తర్వాత ఘటన స్థలంలో దృశ్యాలు దయనీయంగా మారాయి. భయంతో పర్యాటకులు ఏడుపులు, సాయం కోసం కేకలు వేయడం కనిపించింది. ముస్లిమేతరులం కావడంతో ఉగ్రవాదులు వచ్చి తమపై దాడి చేశారని బాధితుల్లో ఒకరు చెప్పారు. తన భర్త తలపై కాల్చినట్లు ప్రాణాలతో బయటపడిన ఓ మహిళ పీటీఐకి ఫోన్‌లో తెలిపింది. ఘటన స్థలానికి చేరుకోవడానికి సరైన రోడ్డు లేకపోవడంతో. గాయపడిన వారిని తరలించడానికి హెలికాప్టర్లను పిలిపించారు. హెలికాప్టర్లు అక్కడికి రాకముందే. కొంతమంది స్థానికులు పోనీలను ఉపయోగించి క్షతగాత్రులను సమీప రహదారికి తీసుకువెళ్లారు. స్థానిక పోనీ హ్యాండ్లర్లు, గైడ్‌లు ప్రాణాలతో ఉన్నవారిని ఓదార్చారు. వారిని అక్కడి నుంచి తరలించడంలో సహాయం చేసారు. ఈ దాడి వార్త తెలుసుకుని. పర్యాటకులు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోతుండటంతో పహల్గామ్‌లోని వీధులు ఖాళీ అయ్యాయి. సింధూ జలాల నిలిపివేత. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది పాకిస్తాన్‌కు బుద్ది చెప్పేలా దౌత్యపరంగా కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత కూడా ఉంది. ఈ క్రమంలోనే భారతదేశం నీటి విడుదలను నిలిపివేయడంతో పాకిస్తాన్‌లో సింధూ పరివాహక ప్రాంతంలో నీటి కొరత ఏర్పడింది. పలు డ్యామ్‌లలో నీరు లేకుండా పోయింది. దీంతో పాకిస్తాన్ దిగివచ్చింది.సింధూ నదీ జల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భారతదేశానికి పాకిస్తాన్ నాలుగుసార్లు లేఖ రాసిందని వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్ రిపోర్టు చేసింది. పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా. ఇప్పటివరకు భారత జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నాలుగు లేఖలు పంపారు. అయితే ఆ లేఖలను విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)కి పంపించారు. ఆపరేషన్ సింధూర్‌తో పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక స్థావరాలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరిని ప్రపంచానికి మరోసారి బహిర్గతం చేసిన భారత్. పశ్చిమ ప్రాంతాలలో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాయాది పాల్పడిన దాడులను సమర్దవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా భారత దళాల పవర్‌ను చూపిస్తూ ఈ క్రమంలోనే ఆందోళన చెందిన పాకిస్తాన్ భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పులు విరమణ కోసం భారత్‌ను వేడుకున్న సంగతి తెలిసిందే.