రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ పత్రాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున లోక్‌భవన్‌కు వెళ్లి శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పెండింగ్‌లో ఇద్దరి పేర్లను ఆమోదించాలని కోరారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్‌, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే ఈ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే అజారుద్దీన్ గతేడాది అక్టోబర్ 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అటు శాసనసభలో, ఇటు శాసనమండలిలో సభ్యుడు కాకపోయినప్పటికీ మంత్రిగా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం. ఎవరైనా ఏ సభలో సభ్యులుగా లేకుండా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే, ఆరు నెలలు పూర్తి కాకముందే ఏదో ఒక సభలో సభ్యులు కావాల్సి ఉంటుందనే సంగతి తెలసిందే. అయితే అజారుద్దీన్ మంత్రి మంత్రి పదవి చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు నెలలు పూర్తి కానుంది. దీంతో ఈ నెలాఖరులోపు ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సిన అవసరం ఉంది. అయితే ఈలోపే గవర్నర్ శివ పత్రాప్ శుక్లా తన వద్ద పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్‌కు ఆమోద ముద్ర లభించాల్సి ఉంది. ఒకవేళ ఈ ఫైల్‌కు గవర్నర్‌ ఆమోదించక అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాకపోతే. ఏప్రిల్ 30 తర్వాత అజారుద్దీన్‌ పదవి కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ శివ పత్రాప్ శుక్లాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పెండింగ్‌లో ఇద్దరి పేర్లను ఆమోదించాలని కోరారు. ఇదిలాఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి శనివారం రోజున గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనా, న్యాయపరమైన విషయాలపై వారు చర్చించారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఏజీ సుదర్శన్ రెడ్డిలో లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారని లోక్ భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.