
అక్షర ఆయుధం ; ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. రామాయణంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. రామాయణంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌పై కొన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్‌కు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు.హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రకాష్ రాజ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామలక్ష్మణులపై ఉద్దేశపూర్వకంగానే ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కలియుగంలో రాముడిని స్పూర్తిగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సినిమాలలో యాక్టింగ్ చేసినట్టు రాముడుపై ట్రోలింగ్ చేస్తే ఒళ్ళు పగిలిపోతుందని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. ఇక, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సినీ నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందించారు. ప్రకాష్ రాజ్ తీరును తప్పుబట్టారు. ‘‘ప్రకాష్ రాజ్... మీరు మిమ్మల్ని మీరు క్రైస్తవ నాస్తికుడని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియలప్పుడు ఆమె విశ్వాసాన్ని గౌరవించారు. ఒక కొడుకుగా అది మా కర్తవ్యంగా మేము గౌరవిస్తాము. అదే స్ఫూర్తితో, మీరు లక్షలాది మంది నమ్మకాలను గౌరవించాలి.