
జనం న్యూస్ : తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లులపై కవిత తీవ్రంగా స్పందించారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ పేరుతో తెలంగాణకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకునేది లేదు అని కవిత హెచ్చరించారు. డీలిమిటేషన్ బిల్లుకు మహిళా రిజర్వేషన్లతో లింక్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. మహిళా బిల్లును ఓబీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టాలని, 33 శాతం కోటాలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా కల్పిస్తేనే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తే వీధుల నుంచి పార్లమెంట్ వరకు పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. 3.13శాతం తగ్గినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కల్వకుంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో డెలిమిటేషన్‌ను ముడిపెట్టడం సరికాదని...దానికి బదులుగా మహిళా రిజర్వేషన్లలోనే ఓబీసీ సబ్ కోటాను చేర్చాలి అని కవిత డిమాండ్ చేశారు. పార్లమెంటులో ప్రస్తుతం తెలంగాణ వాటా 3.13 శాతంగా ఉందని...పునర్విభజన తర్వాత ఈ శాతం తగ్గకూడదని, దానిని బేస్‌లైన్‌గా తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. అంతకంటే ఒక్క శాతం తగ్గినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లే అని కవిత అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన 850 లోక్‌సభ స్థానాల పెంపు వల్ల తెలంగాణ ప్రాతినిధ్యం దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతారని కవిత హెచ్చరించారు. ఓబీసీ మహిళలకు చట్టసభల్లో సరైన వాటా దక్కాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. ప్రాంతీయ అసమానతలకు దారి తీస్తుంది దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెరుగుదల పైకి సానుకూలంగా కనిపిస్తున్నా...