
సాక్షి డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా. 17/4/2026 పరకాల నియోజకవర్గం రిపోర్టర్ మడికొండ పవన్ కుమార్: ఏప్రిల్ 14 నుండి 20వ తారీకు వరకు ఫైర్ సర్వీస్ వీక్ వారోత్సవాలలో భాగంగా ఈరోజు పరకాల పట్టణంలోని సాగర వీధి కాలనీలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వి.భద్రయ్య ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ గోడలకు పోస్టర్లు అంటించి ఇండ్లలో జరిగే గ్యాస్ ప్రమాదాల గురించి మరియు షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడం జరిగింది. అలాగే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 1944 ఏప్రిల్ 14న ముంబై నౌకాశ్రయంలో జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో వీరమరణం పొందిన 66 మంది అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రయ్య మాట్లాడుతూ ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పాఠశాలలో కార్యాలయాలు వ్యాపార సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో అవగాహన సదస్సులు మాక్ డ్రిల్ అలాగే విద్యుత్ భద్రత ఎల్పిజి వినియోగం గ్యాస్ లీకేజీ నివారణ అగ్ని ప్రమాద సమయంలో పాటించవలసిన చర్యలపై ప్రజలకు వివరంగా సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రయ్య సిబ్బంది కృష్ణ కుమార్ గణేష్ దిలీప్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.