పయనించే సూర్యుడు న్యూస్ : డీలిమిటేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగని అన్నారు. వాస్తవానికి దక్షిణాదిలో జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఏపీలోని 25 సీట్ల నుంచి 38 సీట్ల వరకు, తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు పెరిగుతాయని...తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో28 నుంచి 42కి పెరుగుతాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఇలా చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత మరింత తగ్గుతుందని రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో 22 లోక్‌సభ స్థానాల పెంపు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు తగ్గవని...పైగా సంఖ్యాపరంగా, నిష్పత్తి పరంగా కూడా పెరుగుతాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయని నిర్దిష్ట లెక్కలతో సహా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వివరించారు. మరోవైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలు భారీగా పెరుగుతాయి అని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం 23.97శాతం లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్యను పెంచిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల సీట్లు కూడా పెరుగుతాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించారు. కర్ణాటకలో 28 నుంచి 42కి, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళంలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 543 సీట్లున్న లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు 129 స్థానాలు (23.76 శాతం) ఉండగా...డీలిమిటేషన్ తర్వాత 195 స్థానాలకు (సుమారు 23.97 శాతం)కు చేరుతాయని అన్నారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఏ రాష్ట్రంపైనా మాకు వివక్ష లేదు: ప్రధాని నరేంద్రమోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇలా అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని ప్రధాని తెలిపారు. డీలిమిటేషన్ బిల్లుతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రసక్తేలేదు అని వివరణ ఇచ్చారు. మీకు గ్యారెంటీ కావాలంటే నా మాటే గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంపైనా తమకు వివక్ష లేదు అని ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం: ప్రధాని నరేంద్రమోడీ దేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లు దేశానికి సరికొత్త దశను, దిశను నిర్దేశిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు.