
అక్షర ఆయుధం ; అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించగా... ఆ గడువు ముగియక ముందే అమెరికా-ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణను పొడిగించి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం మధ్యవర్తులు ప్రయత్నాలు చేస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గత వారం అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో కాల్పుల విరమణ అమలుపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు ఇరాన్ ఓడరేవులను దిగ్భంధనం చేస్తామని అమెరికా బెదిరింపులు... మరోవైపు వెనక్కి తగ్గబోమని ఇరాన్ హెచ్చరికలు... ఇరుదేశాల మధ్య వారం రోజుల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రమాదంలో పడేశాయి. అయితే తాజాగా ఇరాన్‌తో మరోమారు చర్చలు జరిపేందుకు సిద్దమవుతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరుదేశాల మధ్య మరింత దౌత్యానికి వీలుగా మధ్యవర్తులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడానికి అమెరికా, ఇరాన్‌లు "సూత్రప్రాయంగా అంగీకరించాయని మధ్యవర్తులు అసోసియేటెడ్ ప్రెస్‌కు చెప్పారు. ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో పాలుపంచుకుంటున్న ప్రాంతీయ అధికారులలో ఒకరి ప్రకారం... అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇదివరకు ప్రకటించిన కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 22న ముగియనుంది. ఈ గడువు ముగియక ముందే... ఇటీవల ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు ఆటంకం కలిగించిన మూడు ప్రధాన వివాదాంశాలైన ఇరాన్ అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధి, యుద్ధ నష్టాలకు పరిహారం వంటి వాటిపై రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ అధికారులు పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఇక, అమెరికా, ఇరాన్‌ల మధ్య మరోమారు చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. రాబోయే రెండు రోజుల్లో ఇరాన్‌తో చర్చలు జరగవచ్చని డోనాల్డ్ ట్రంప్ ది న్యూయార్క్ పోస్టుకు తెలిపారు. ఈ చర్చలు పాకిస్తాన్లో జరగనున్నాయని చెప్పారు. ఫోన్లో న్యూయార్క్ పోస్టుతో మాట్లాడిన ట్రంప్... చర్చలు జరుగుతున్నాయని, అయితే అవి నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి జరిగే రెండో విడత ప్రత్యక్ష చర్చలు బహుశా ఐరోపాలో ఎక్కడో ఒకచోట జరుగుతాయని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికి ట్రంప్ మరోసారి ఫోన్ ద్వారా మాట్లాడుతూ... రాబోయే రెండు రోజుల్లో ఏదైనా జరగవచ్చని తెలిపారు. చర్చల కోసం తాము ఇస్లామాబాద్ అక్కడికి వెళ్లడానికే ఎక్కువ మొగ్గు చూపు తున్నామని అన్నారు. ఎందుకంటే ఫీల్డ్ మార్షల్ (పాకిస్తాన్) గొప్ప పని చేస్తున్నారని ప్రశంసించారు. మరోవైపు, అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండో దశ చర్చలు గురువారం జరిగే అవకాశం ఉందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే.