పయనించే సూర్యుడు న్యూస్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు మంగళవారం రోజున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు మంగళవారం రోజున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఈ సదర్భంగా మిడిల్ ఈస్ట్‌లో వేగంగా మారుతున్న పరిస్థితుల గురించి కూడా మోదీ, ట్రంప్ చర్చించారు. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఇంధన భద్రత, కీలక సముద్ర మార్గాల స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ట్రంప్, మోదీల మధ్య మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఇక, ట్రంప్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ప్రదాని మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ‘‘నా మిత్రుడు, అధ్యక్షుడు (అమెరికా) డొనాల్డ్ ట్రంప్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వివిధ రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని మేము సమీక్షించుకున్నాము. అన్ని రంగాలలో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము పశ్చిమ ఆసియాలోని పరిస్థితి గురించి కూడా చర్చించాము. హర్మూజ్ జలసంధిని తెరిచి, సురక్షితంగా ఉంచడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాము’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పందించారు. ఇరువును నేతల మధ్య సంభాషణ సానుకూలంగా సాగిందన్నారు. ‘‘మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మీరు (మోదీ) తెలుసుకోవాలని నేను (ట్రంప్) కోరుకుంటున్నాను... అని ట్రంప్ ప్రధాని మోదీతో అన్నారు" అని సెర్గియో గోర్ చెప్పారు. ఈ ఏడాది నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఇది మూడో ఫోన్ సంభాషణ. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చిన తర్వాత ట్రంప్, మోదీల మధ్య రెండో సంభాషణ. ఈ ఇద్దరు నాయకులు మొదట ఫిబ్రవరి 2న వాణిజ్య ఒప్పందంపై పురోగతిని ప్రకటించడానికి మాట్లాడారు. ఆ తర్వాత మార్చి 24న పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న పరిస్థితిపై చర్చించడానికి మరోసారి ఫోన్లో సంభాషణ జరిపారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఇరుదేశాల మధ్య సంబంధాలు, పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్ చర్చించారు.