జనం న్యూస్ : భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా సాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘నారీ శక్తి వందన సమ్మేళనం’ అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, దేశాభివృద్ధిలో మహిళల పాత్రను కొనియాడుతూ కీలక ప్రసంగం చేశారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా సాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘నారీ శక్తి వందన సమ్మేళనం’ అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, దేశాభివృద్ధిలో మహిళల పాత్రను కొనియాడుతూ కీలక ప్రసంగం చేశారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును "21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి"గా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, భారతీయ మహిళల శక్తికి, వారి ఆత్మగౌరవానికి దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో పార్లమెంట్ ఒక నూతన అధ్యాయాన్ని లిఖించే సమయం ఆసన్నమైందని, ఈ దిశగా అడుగులు వేయడం గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ప్రయాణాన్ని గుర్తుచేస్తూ, దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ విజయం లభించిందని ప్రధాని అన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో దేశమంతా ఐక్యంగా ఉందని, 2029 నాటికి ఈ కోటాను తప్పనిసరిగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నాయని, అందరి సహకారం, చర్చలు మరియు భాగస్వామ్యం ద్వారా ఈ సవరణ బిల్లును విజయవంతంగా ఆమోదింపజేయడమే తమ ప్రాధాన్యత అని వివరించారు. పాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగితే వ్యవస్థలో మానవీయ కోణం మరియు సున్నితత్వం పెరుగుతాయని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడించాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి ఉదాహరణగా ‘జల్ జీవన్ మిషన్’ విజయాన్ని ఆయన ప్రస్తావించారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా ప్రాజెక్టు విజయవంతం కావడానికి పంచాయతీ స్థాయిలో మహిళలు చురుగ్గా పాల్గొనడమే ప్రధాన కారణమని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో నాయకత్వం వహిస్తున్న 14 లక్షల మంది మహిళలకు క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం ఉందని, వారు ఇప్పుడు చట్టసభల్లో పెద్ద పాత్ర పోషించడానికి సర్వసిద్ధంగా ఉన్నారని ఆయన మద్దతు తెలిపారు. మహిళల వృత్తిపరమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం ప్రసూతి సెలవులను (Maternity Leave) 12 వారాల నుండి 26 వారాలకు పెంచిందని ప్రధాని వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు. మహిళలు తమ ఉద్యోగ బాధ్యతలకు మరియు మాతృత్వానికి మధ్య సమతుల్యతను కాపాడుకునేలా ఈ సౌకర్యం కల్పించామన్నారు. ఇది భారతీయ మహిళల కెరీర్ వృద్ధికి అడ్డంకులు లేకుండా చేస్తుందని ఆయన ఆకాంక్షించారు. భారతదేశం సాధించిన ఈ ప్రగతి అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆకర్షిస్తోందని ప్రధాని గర్వంగా చెప్పారు. మన దేశంలో రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి నుండి ఆర్థిక మంత్రి వరకు మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. చాలా రాష్ట్రాల్లో పంచాయతీలలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉందని, ఇది సమానత్వ భారతావని దార్శనికతకు ప్రతిబింబమని అన్నారు. ఏప్రిల్ 16 నుండి 18 మధ్య ఉండబోయే కీలక తేదీలు ఈ క్రతువులో మైలురాళ్లుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇది అంకితభావం మరియు విజయాల కలయిక అని అభివర్ణించారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ మహిళల గళానికి, వారి అనుభవాలకు చట్టబద్ధమైన ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అనేది ఇకపై నినాదం మాత్రమే కాకుండా, పరిపాలనలో అంతర్భాగం కాబోతోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.