టీడీపీ కార్యకర్తల కోసం E3 స్కీమ్

★ టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం ప్రకటించిన సీఎం చంద్రబాబు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించారు. వివరాలు... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధిష్టానం పార్టీ సీనియర్ నేతలతో నేతలు, కార్యకర్తలకు శిక్షణ ఇప్పిస్తుంది. ఈ క్రమంలోనే శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శనివారం (ఏప్రిల్ 11) రోజున టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు... రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టామని, క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నామని తెలిపారు. క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీని నిలిపేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలని... పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలని... గతానికంటే టీడీపీ ఓట్ బ్యాంక్ పెరగాలని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తల కోసం E3 ప్రొగ్రాం తీసుకొస్తామని తెలిపారు. నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ కార్యక్రమం చేపడతామని చెప్పారు. తన కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచన చేశానో... టీడీపీ కుటుంబం కోసం అదే విధంగా ఆలోచన చేస్తున్నానని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలేకు సీఎం చంద్రబాబు నివాళి... మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు తన క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్ లు, బీసీ నేతలు పాల్గొన్నారు.