క్షేమంగా ల్యాండైన వ్యోమగాములు

కానీ కల్పనా చావ్లా ప్రయాణించిన షటిల్‌కు ఏం జరిగింది?

అక్షర ఆయుధం ; చంద్రుడిని చుట్టి క్షేమంగా భూమిని చేరిన ఆర్టెమిస్ బృందం...కల్పనా చావ్లా ప్రయాణించిన స్పేస్ షటిల్‌కు ఏమైంది? ఆ రోజు ఏం జరిగిందంటే...అర్టెమిస్-2 విజయవంతంగా చంద్రుడిని చుట్టు భూమిని చేరుకుంది. ఈ మిషన్‌లో భాగంగా చంద్రుడిని చుట్టి వ‌చ్చిన న‌లుగురు వ్యోమ‌గాములు ఇవాళ క్షేమంగా భూమికి తిరిగి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో స‌మీపంలో సుముద్రంలో ఆ వ్యోమ‌గాములు వెళ్లిన ఓరియ‌న్ స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండైంది. 9 రోజుల జర్నీ అత్యంత విజయవంతంగా పూర్తి చేసుకుని పసిఫిక్ మహా సముద్రంలో ఓరియన్ క్యాప్సిల్ సురక్షితంగా దిగింది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 1, అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వస్తున్న వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం భారత వ్యోమగామి కల్పనా చావ్లా ప్రాాణాలు కోల్పోయారు. కొలంబియా విషాదానికి 23 ఏళ్లు... ఆ రోజు ఏం జరిగిందంటే...2003 ఫిబ్రవరి 1న విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత వ్యోమగామి కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయారు. 15 రోజుల పాటు శూన్య గురుత్వాకర్షణలో అంతరిక్షంలో పనిచేసిన తర్వాత 'కొలంబియా' అనే స్పేస్ షటిల్ భూమికి తిరిగి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంతరిక్షంలోకి వెళ్లిం, అక్కడ విజయవంతంగా మిషన్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో కల్పనా చావ్లా మరణించింది. స్పేస్ షటిల్‌లో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లమ్‌తో ల్యాండింగ్‌కు 16 నిమిషాల సమయం ఉందనగా కుప్పకూలింది.ఈ ప్రమాదంలో కల్పనా తో పాటు ఉన్న ఏడుగురు వ్యోమగాములు మరణించారు. ఫిబ్రవరి 1,2023న కేప్ కెనవెరాల్‌లోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో ఉన్న వారందరూ, 15 రోజుల పాటు అంతరిక్ష శూన్యంలో గడిపిన తర్వాత కొలంబియా స్పేష్ షటిల్ సురక్షితంగా భూమికి తిరిగివచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. నాసా ఎంట్రీ ఫ్లైట్ డైరెక్టర్ అయిన లెరాయ్ కెయిన్, STS-107 దిగడం కోసం డి-ఆర్బిట్ , రీఎంట్రీ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి షటిల్ కమాండర్ రిక్ హస్బెండ్‌కు తుది అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత కొలంబియా స్పేష్ షటిల్ 28వ అంతరిక్ష యాత్ర ముగిసిపోయింది. ఆ తర్వాత జరిగిన యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఆకాశంలో మంటలు, నిప్పురవ్వలతో కొలంబియా స్పేష్ షటిల్ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యోమగాములు, కల్పనా చావ్లాతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే? కొలంబియా స్పేష్ షటిల్ రీఏంట్రీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హైడ్రాలిక్ ఫ్లూయిడ్ టెంపరేచర్ సాధారణ స్థాయికి మించి పడిపోయాయని టెలిమెట్రీ సూచించింది. ఆ లోపాన్ని గర్తించేందుకు, వివరించేందుకు సాధ్యం కాలేదు. అయితే దీనికి విరుద్దంగా హైడ్రాలిక్ సిస్టమ్‌కు సంబంధించిన అన్ని ఇండికేటర్స్ అన్ని సాధారణంగానే ఉన్నాయి. సాధారణ స్థాయికి మించి పడిపోయిన ఫ్లూయిడ్ టెంపరేచర్ వలన ఎడమ వైపు టైరులో అకస్మాత్తుగా గాలిపీడన తగ్గిపోయింది, టైర్‌లో సరైన ప్రెషర్ లేకపోవడం వలన స్పేస్ షటిల్‌ను ల్యాండ్ చేయడంలో సమస్య ఏర్పడింది. పలు రిపోర్ట్స్ ప్రకారం, కొలంబియాలో చాల వరకు సెన్సార్స్ పనిచేయకపోడవం వలన, అన్ని రకాల కమ్యూనికేషన్స్‌లో అంతరాయం ఏర్పడింది. రాడార్‌తో కాంటాక్ట్‌ను తిరిగి ఏర్పరచడానికి, అంతరిక్ష నౌకను గుర్తించడానికి హ్యూస్టన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటికే ప్రమాదం జరిగిపోయింది.కల్పనా చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్‌లో కల్పనా చావలా జన్మించింది. కర్నాల్‌లోని టాగోర్ స్కూల్‌లో తన స్కూల్ ఎడ్యుకేషన్, చావలా పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. ఇంజనీరింగ్ తర్వాత, కల్పనా చావ్లా అమెరికాకు వెళ్లారు, అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని , కొలరాడో విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ను పొందారు. 1988లో ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)లో పవర్డ్-లిఫ్ట్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత, 1994 డిసెంబర్‌లో నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1997లో కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. 1997లో తన తొలి అంతరిక్ష యాత్రలో, చావ్లా STS-87 మిషన్‌లో భాగంగా ఉన్నారు. ఈ మిషన్ 376 గంటల 34 నిమిషాలలో 65 లక్షల మైళ్లు ప్రయాణించి, భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించింది.