కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

★ “అన్నా” అంటూ కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి ★ “దేవుడే పంపించాడు!” కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ‌ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీమంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డిని కేసీఆర్ తన ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాజీమంత్రి జీవన్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించారు.ఈ సందర్భంగా కేసీఆర్‌ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘అన్నా.. నన్ను దేవుడే పంపిండు. మీతో కలిసి పని చేయమని’ అంటూ కేసీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక ఇక లాంఛనమే అన్నది తేలిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీలోకి రావాలని మాజీమంత్రి జీవన్ రెడ్డిని ఆహ్వానించగా కేసీఆర్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో మాజీమంత్రి జీవన్ రెడ్డితోపాటు కుమారులు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు ఉన్నారు. మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపించాడు: జీవన్ రెడ్డి తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని కేసీఆర్‌తో మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ల కైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అంటూ మాజీమంత్రి జీవన్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇకపోతే కేసీఆర్‌ నివాసానికి తొలిసారి వచ్చిన మాజీమంత్రి జీవన్‌ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించిన కేటీఆర్ అంతకుముందు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు జీవన్ రెడ్డిని తమ సహచరులందరితో కలిసి సాదరంగా ఆహ్వానించేందుకు వచ్చాం అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ‘2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ నిబద్ధత గల నాయకుడిగా ఆయన కాంగ్రెస్‌తోనే కొనసాగారు.కేసీఆర్, జీవన్ రెడ్డి బంధం ఈనాటిది కాదు. 2 జూన్ 2014లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాక మొట్టమొదటి సారి జగిత్యాలకు వచ్చారు. ఆ రోజు బోర్నపల్లి బ్రిడ్జి గురించి జీవన్ రెడ్డి కేసీఆర్‌ను అడిగారు. ఆయన అడిగిందే తడవుగా కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి సాంక్షన్ ఇచ్చారు’అని కేటీఆర్ గుర్తు చేశారు. నిఖార్సైన నేతలను కాంగ్రెస్ అవమానిస్తోంది కరీనంగర్‌లో షుగర్ ఫ్యాక్టరీపై జీవన్ రెడ్డి ఫైట్ చేశారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఆ క్రమంలోనే కేసీఆర్ మహారాష్ట్ర తరహా కో ఆపరేటివ్ సొసైటీ పద్ధతిలో పెడదామన్నారు అని మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి జీవన్ రెడ్డి చేరిక బాగుంటుందని జగిత్యాల నాయకత్వం కూడా మద్దతు తెలిపింది అని చెప్పుకొచ్చారు.నిఖార్సైన జీవన్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ అవమానపరుస్తోంది.నేను భట్టి ఇంటికి పెళ్లికి పోయినప్పుడు కూడా వంద మంది రాబోయేది మీ ప్రభుత్వమే అని అన్నారు.కేసీఆర్‌ను కూడా కలిసి తన నిర్ణయం ప్రకటిస్తామన్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. బాసరలో సీఎం రేవంత్ రెడ్డి భాష అసహ్యంగా ఉంది మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాలం నెట్టుకొచ్చే ప్రభుత్వం ఇది అంటూ ధ్వజమజెత్తారు. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని.. 70 లక్షల కోట్లు రైతులకు బకాయి పడ్డారు అని చెప్పుకొచ్చారు. బాసరలో ముఖ్యమంత్రి భాష అసహ్యంగా ఉంది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.