
అక్షర ఆయుధం ; టీవీలు లేదా సోషల్ మీడియాకు యువతే కాదు పెద్దవాళ్లు కూడా అడిక్ట్ అయిపోయారు. మెుబైల్ ఆపరేటింగ్ చేయడం తెలియనివాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటే యువత మాత్రం మెుబైల్కు పనిచెప్తున్నారు. ఇటీవల కాలంలో ఈ రెండింటికి అడిక్ట్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతంది. ఇలా గంటల తరబడి ఒకే చోటు కూర్చోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అని ఒక అధ్యయనంలో తేలింది.అలా కూర్చున్నవారు మతిమరుపు సమస్యకు గురవుతారని తేలింది. ఒకేచోట కూర్చుని మెదడుకు చురుకుదనాన్నిచ్చే పనులు చేసేవారితో పోలిస్తే, మెదడుకు ఎలాంటి పని చెప్పకుండా ఉండే పనులు చేసేవారిలో డీమెన్షియా ముప్పు ఎక్కువగా ఉన్నట్టు అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తమ అధ్యయనాల్లోపేర్కోంది. టీవీ చూసే వారిలో మతిమరుపు అత్యధికం వివరాల్లోకి వెళ్తే అదేపనిగా కూర్చుని ఉండేవారు...గంటల తరబడి టీవీలకు అతుక్కునే వారిపై అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధ్యయనం చేసింది. ఇందుకు స్వీడన్లో 20,000 మందికి పైగా పెద్దల నుంచి వివరాలు సేకరించింది.ఆ 20 వేల మందిని పలు విభాగాలుగా విభజించింది. వారిలో టీవీ చూడటం, సంగీతం వినడం వంటి మెదడుకు పనిచెప్పని పనులు చేసేవారిని ఒక భాగంగా అలాగే ఆఫీస్ పని, అల్లికలు, కుట్లు వంటి మెదడుకు పనిచెప్పే పనులు చేసేవారిని మరో విభాగంగా సెపరేట్ చేసి వారి ఆలోచనలు, వారి లక్షణాలను పరిశీలించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వారిని విశ్లేషించగా టీవీ చూసే వారిలో మతిమరుపు ఎక్కువగా కనిపించింది అని అమెరికా జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ సంస్థ తమ అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొంది.నిష్క్రియాత్మక పనుల వల్ల మతిమరుపు ప్రతి గంట మెదడుకు చురుకుదనాన్ని ఇచ్చే పని చేయడం వల్ల డిమెన్షియా ముప్పు 4 శాతం తగ్గుతుంది అని అమెరికా జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ సంస్థ పేర్కొంది.అలాగే గంటసేపు టీవీ చూడటానికి బదులుగా మెదడుకు మేతనిచ్చే పని చేస్తే మతిమరుపు ముప్పు 7 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు.అయితే ఈ అధ్యయనం 1997లో ప్రారంభమైందని.. .అప్పటికి స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటివి అందుబాటులో లేవని పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు. ప్రస్తుత సమాజంలో ఫోన్లు, సోషల్ మీడియా వాడకం కూడా మెదడుకు పనిచెప్పని నిష్క్రియాత్మక పనుల కిందకే వస్తుందని...వీటి వల్ల మెదడు ఏకాగ్రతను దెబ్బతీస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మెదడుకు నిరంతరం సవాలు విసరడం ద్వారా అది ఆరోగ్యంగా ఉంటుందని..కొత్త హాబీ, కొత్త భాష లేదా సంగీత వాయిద్యం నేర్చుకోవడం వంటివి ‘కాగ్నిటివ్ రిజర్వ్’ను పెంచి మెదడును చురుగ్గా ఉంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.