
సాక్షి డిజిటల్ న్యూస్: దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పీఎన్జీ కనెక్షన్లు పెరగాలి. ఆయిల్ కంపెనీలు లక్ష్యం చేరుకోవాలి అని సూచించారు. శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైపు లైన్ పనుల పూర్తికి కేంద్రం మంత్రికి సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు కోరారు. పశ్చిమాసియాలో యుద్దాల కారణంగా తలత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీపం పథకం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. దీపం పథకం లబ్దిదారులు పీఎన్జీకి మారితే వారికి దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్మును జమ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని దీనిపై వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వచ్చే 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలి. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా దీపం పథకం ద్వారా కలిగే లబ్ది పొందవచ్చన్న విషయంపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని. ఈ విషయంలో జాప్యం ఉండకూడదని, టార్గెట్ ఎట్టిపరిస్థితుల్లో చేరుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ సరఫరాలో సమస్యలను అధిగమించామని తెలిపారు. డొమస్టిక్ పంపిణీకి సంబంధించి సమస్యను తగ్గించామని త్వరలో సాధారణ స్థితికి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రమంత్రికి చంద్రబాబు ఫోన్ శ్రీకాకుళం - కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సమీక్ష నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబుతో బీసీ సంఘాలు భేటీ బీసీల సంక్షేమానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, జాతీయ అధ్యక్షుడు జే. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నేతలు సీఎంకు విజ్ఞాపన పత్రాలను అందించారు. జనాభా దామాషా ప్రాతిపదికన తమకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా త్వరితగతిన తేవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు, కేంద్రంతో మాట్లాడి ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయించడంతో పాటు, ఓబీసీ సబ్ ప్లాన్ రూపొందించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అన్ని శాఖల ఉద్యోగాల నియామకాలలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంఘం నేతలు వినతి పత్రంలో సీఎం చంద్రబాబు నాయుడను కోరారు. ఏపీ బీసీ సంఘం నేతల నుంచి విజ్ఞాపన పత్రాలను తీసుకున్న ముఖ్యమంత్రి. కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను వారితో సంప్రదించి నెరవేర్చేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బీసీలకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా నేతలు ముఖ్యమంత్రితో అన్నారు. బీసీలకు ప్రభుత్వం అందిస్తూన్న ఆదరణ, చేనేతలకు ఉచిత విద్యుత్, మత్య్సకారులకు వేట నిషేధ భృతి, 217 జీవో రద్దు, కల్లు గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు, వడ్డెరలకు మైనింగ్‌లో రిజర్వేషన్లు వంటి వాటిని తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని బీసీ నేతలు వ్యాఖ్యానించారు.